Urvashi Rautela: సిగ్గుగా ఉందంటూ 'డాకు మహారాజ్' నటి పోస్ట్... సైఫ్ అలీ ఖాన్ దాడిపై నోరు జారినందుకు క్షమాపణలు
Urvashi Rautela: సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడిపై నోరు జారినందుకు హీరోయిన్ ఊర్వశి రౌతేలా తాజాగా క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.

సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి గురించి గత రెండ్రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీలో చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన త్వరగా కోలుకోవాలని సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. చిరంజీవి, ఎన్టీఆర్ వంటి స్టార్స్ టాలీవుడ్ నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. మరి కొంతమంది డైరెక్టుగా సైఫ్ అలీ ఖాన్ ను కలిసి, పరామర్శిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి గురించి ప్రస్తావన రాగా, 'డాకు మహారాజ్' నటి బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా నోరు జారింది. ఆమె కామెంట్స్ దారుణంగా ట్రోల్స్ రావడంతో తాజాగా మరోసారి ఘటనపై స్పందిస్తూ సైఫ్ అలీ ఖాన్ కి క్షమాపణలు చెప్పింది.
సిగ్గుగా ఉంది అంటూ పోస్ట్...
ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి సైఫ్ త్వరగా కోలుకోవాలని అంటూనే, అదే సమయంలో తన వజ్రపు ఉంగరాన్ని చూపిస్తూ మాట్లాడింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో తాజాగా ఆమె సైఫ్ కి క్షమాపణలు చెబుతూ ఇన్స్టా లో ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్టులో "సైఫ్ సర్... మీ గురించి మాట్లాడే టైంలో అలా ప్రవర్తించినందుకు విచారంగా ఉంది. నేను ప్రవర్తించిన తీరుపై మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. ఆ ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో మీపై జరిగిన దాడి తీవ్రత గురించి నాకు అవగాహన లేదు. గత కొన్ని రోజుల నుంచి నేను డాకు మహారాజ్ మూవీ విజయోత్సహంలో ఉండడంతో, ఆ సినిమా వల్ల నాకు వచ్చిన బహుమతుల గురించి మాట్లాడాను. ఇలా 'డాకు మహారాజ్' సక్సెస్ లో ఉన్న నేను మీ విషయంలో మరిచిపోయి ఇలాంటి కామెంట్స్ చేసినందుకు సిగ్గు పడుతున్నాను. ఇప్పుడే నేను మీరు ఎదుర్కొన్న దాడి తీవ్రత గురించి తెలుసుకున్నాను. అందుకే మీకు క్షమాపణ చెప్తూ ఈ పోస్ట్ రాస్తున్నాను. ఆ టైంలో మీరు చూపించిన తెగువ మామూలుది కాదు. మీపై మరింత గౌరవం పెరిగింది. సైఫ్ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి" అంటూ తను చేసిన తప్పును తెలుసుకొని సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరింది ఊర్వశి.
Also Read: టీవీ ఇండస్ట్రీలో ఘోర విషాదం... ట్రక్కు ఢీ కొట్టడంతో 22 ఏళ్ల నటుడు మృతి
ఊర్వశి చేసిన కామెంట్స్ ఏంటి ?
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'డాకు మహారాజ్' మూవీ సక్సెస్ ఫుల్ 100 కోట్లకు పైగా సాధించి, సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించగా, ఊర్వశి రౌతెల స్పెషల్ సాంగ్ చేసింది. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను నాగవంశీ నిర్మించారు. తాజా ఇంటర్వ్యూలో ఊర్వశి ఈ సినిమా వల్ల తనకు అందిన గిఫ్ట్ లను, సైఫ్ దాడికి ముడిపెట్టి మాట్లాడడం విమర్శలకు దారి తీసింది. సైఫ్ పై జరిగిన దాడిపై ఊర్వశి స్పందిస్తూ "ఆయనపై జరిగిన దాడి దురదృష్టకరం. నేను నటించిన డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ గా నిలిచి, 150 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది. దీంతో మా అమ్మ నాకు డైమండ్ రింగ్ గిఫ్ట్ గా ఇవ్వగా, మా నాన్న రోలెక్స్ వాచ్ ఇచ్చారు. అయితే ఈ దాడి నేపథ్యంలో వీటిని బహిరంగంగా ధరించి, బయటకు వెళ్లాలంటే ఎవరైనా దాడి చేస్తారేమోనని అభద్రతాభావం నెలకొంది" అని చెప్పుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా ఊర్వశీ రౌతేలా కామెంట్స్ పై నెగిటివిటీ పెరిగి, ఆమెను సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ తో ఓ ఆట ఆడుకున్నారు.
Also Read: పటౌడీ వారసుడు, వేల కోట్ల ఆస్తులకు అధిపతి... నవాబ్ సైఫ్ జీవితంలో ఆసక్తికర విషయాలు తెలుసా?