Hari Hara Veera Mallu Movie Third Single Release Date: పవర్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ. లేటెస్ట్ పీరియాడిక్ అడ్వెంచర్ మూవీ 'హరిహర వీరమల్లు' మరో సాంగ్ వచ్చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ ట్రెండ్ సృష్టించగా ఇప్పుడు మూడో సాంగ్ అలరించబోతోంది.

తుపాను వచ్చేస్తోంది

ఈ మేరకు మూవీ టీం కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ నెల 21న 'తుపాన్ వచ్చేస్తోంది' అంటూ ట్వీట్ చేసింది. ఉదయం 11:55 గంటలకు 'అసుర హననం' సాంగ్ రిలీజ్ చేయనున్నారు. 'హరిహర వీరమల్లు థర్డ్ సింగిల్ - ఈ ఏడాది అత్యంత శక్తివంతమైన ట్రాక్' అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Also Read: హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామా నుంచి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ వరకూ.. - ఈ వారం థియేటర్స్, ఓటీటీల్లో మూవీస్ లిస్ట్

జూన్ 12న రిలీజ్

ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు ఇటీవలే మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. వివిధ కారణాలతో పలుమార్ల వాయిదా పడుతూ వచ్చిన మూవీని జూన్ 12న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. 'జీవితకాలపు యుద్ధానికి సిద్ధంగా ఉండండి. ధర్మం కోసం యుద్ధం ప్రారంభమవుతుంది.' అని పేర్కొన్నారు. రీరికార్డింగ్, డబ్బింగ్ పనులు శరవేగంగా పూర్తి చేస్తుండగా.. ట్రైలర్, సాంగ్స్ రిలీజ్‌పై దృష్టి సారించారు. ఇప్పుడు థర్డ్ సింగిల్ రిలీజ్ చేస్తుండగా.. ట్రైలర్ సైతం త్వరలోనే రిలీజ్ కానుంది.

పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్తా, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.దయాకర్‌రావు మూవీని నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ మూవీని రెండు పార్టులుగా తెరకెక్కించనుండగా.. ఫస్ట్ పార్ట్ 'హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఇదివరకు ఎప్పుడూ కనిపించని డిఫరెంట్, పవర్ ఫుల్ రోల్ లో పవన్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సగానికి పైగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా.. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో మిగిలిన భాగాన్ని ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం కుమారుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశారు. రెండో పార్ట్‌కు కూడా ఆయనే దర్శకత్వం వహించనున్నారు.

ఫ్యాన్స్‌లో ఉత్కంఠ

చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ మూవీ వస్తుండడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తితో పాటు టెన్షన్ నెలకొంది. జూన్ 12న మూవీ రిలీజ్ అని మేకర్స్ ప్రకటించగా.. జూన్ నుంచి థియేటర్స్ బంద్ అని ఎగ్జిబిటర్స్ ఆదివారం ప్రకటించగా ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. చెప్పిన డేట్‌కు రిలీజ్ అవుతుందా? అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అటు, ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఇదే చర్చ సాగుతోంది.