Crazy Rumour About Allu Arjun Atlee Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ మూవీ అనౌన్స్‌మెంట్ రాగానే భారీ హైప్ నెలకొంది. ఈ మూవీ నుంచి అప్‌డేట్స్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఏ బజ్ వచ్చినా క్షణాల్లోనే ట్రెండ్ అవుతోంది. తాజాగా.. ఈ మూవీపై మరో వైల్డ్ రూమర్ ట్రెండ్ అవుతోంది.
అల్లు అర్జున్ రోల్ ఏంటి?
సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో హై ఆక్టేన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా 'AA22XA6' వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని తెరకెక్కించనుండగా.. వీఎఫ్ఎక్స్ భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. సమాంతర ప్రపంచం, పునర్జన్మ బ్యాక్ డ్రాప్‌లో రాబోతోన్న ఈ మూవీలో అల్లు అర్జున్ రోల్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలుత ఆయన డ్యూయెల్ రోల్‌లో నటిస్తారని.. ఒకటి హీరోగా.. మరొకటి నెగిటివ్ రోల్‌లో ఉంటుందనే టాక్ వినిపించింది.
తాజాగా.. ఓ వైల్డ్ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో బన్నీ మూడు డిఫరెంట్ రోల్స్‌లో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఒక రోల్ మాత్రం పూర్తి యానిమేటెడ్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే టాలీవుడ్‌లో ఓ మైలురాయి అనే చెప్పాలి. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read: తన AV చూసి మంచు మనోజ్ కన్నీళ్లు - బాబాయ్‌కు ఏది ఏమైనా అండగా ఉంటానంటూ నారా రోహిత్ పోస్ట్
స్టైలిష్ లుక్‌లో బన్నీ
'పుష్ప 2' భారీ హిట్ తర్వాత బన్నీ 'పుష్ప రాజ్' లుక్ నుంచి బయటకు వచ్చి న్యూ లుక్‌లో కనిపించారు. ఇటీవల సోషల్ మీడియాలో పలు ఫోటోస్ హల్చల్ చేయగా.. అవి అట్లీ మూవీ కోసమేనంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తన లుక్, ఫిట్ నెస్‌పై దృష్టి సారించారు. ఇందుకోసం ఫేమస్ ఫిట్ నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్‌ను తీసుకున్నారు. ఆయన గతంలో ఎన్టీఆర్, మహేష్ బాబులకు ఫిట్ నెస్ ట్రైనింగ్ ఇచ్చారు.
ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారనే విషయం ఇప్పటికే తెలిసినప్పటికీ వారు ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఓ రోల్ కోసం మృణాల్ ఠాకూర్‌ను సంప్రదించారని.. కథా చర్చలు సైతం పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె లుక్ టెస్టులో పాల్గొన్నట్లు సమాచారం. దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరో ఇద్దరి రోల్స్ కోసం జాన్వీ కపూర్, దిశా పటానీ, శ్రద్ధాకపూర్ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నా.. దేనిపైనా స్పష్టత లేదు.
షూటింగ్ ఎప్పుడంటే?
బన్నీ క్రేజ్ దృష్ట్యా ఇంటర్నేషనల్ లెవల్‌లో ఈ మూవీని అట్లీ ప్లాన్ చేశారు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. వీఎఫ్ఎక్స్ కోసం అంతర్జాతీయంగా ఓ కంపెనీని సంప్రదించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతుండగా.. ఈ ఏడాది ఆగస్టులో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాల టాక్. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి అన్ని అప్ డేట్స్ తెలిసే ఛాన్స్ ఉంది.