హిందీ బుల్లితెర పరిశ్రమలో ఘోర విషాదం చోటు చేసుకుంది. యువ నటుడు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. బాలీవుడ్ సీరియల్స్, టీవీ షోస్ చూసే వీక్షకులకు 'ధర్తీపుత్ర నందిని' (Dhartiputra Nandini) గుర్తు ఉండే ఉంటుంది. అందులో అమన్ జైస్వాల్ (Aman Jaiswal) లీడ్ రోల్ ప్లే చేశారు. అతను ఇక లేరు.
రోడ్డు ప్రమాదంలో మరణించిన అమన్ జైస్వాల్
అమన్ జైస్వాల్ ఒక కొత్త టీవీ షోలో నటించినందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆడిషన్ ఇవ్వడం కోసం బైక్ మీద అతను ట్రావెల్ చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఒక ట్రక్కు బలంగా ఢీ కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడని ముంబై వర్గాల ద్వారా తెలిసింది.
అమన్ మరణ వార్తను 'ధర్తీపుత్ర నందిని' రైటర్ ధీరజ్ మిశ్రా కన్ఫర్మ్ చేశారు. సోషల్ మీడియాలో యువ నటుడికి నివాళి అర్పిస్తూ... ఒక పోస్ట్ చేశారు ధీరజ్ మిశ్రా.
''అమన్... నువ్వు ఎప్పటికీ మా జ్ఞాపకాలలో ఉంటావు. కొన్ని సందర్భాలలో భగవంతుడు ఎంత క్రూరంగా ఉంటాడో కదూ! ఇవాళ నీ మరణం మరొకసారి అది నాకు తెలిసేలా చేసింది. గుడ్ బై'' అని సోషల్ మీడియాలో ధీరజ్ ఒక పోస్ట్ చేశారు. అమన్ ఫోటోను ఆయన షేర్ చేశారు. అమన్ మరణం పట్ల పలువురు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అమన్ జైస్వాల్ నేపథ్యం ఏమిటి? అతని వయసెంత?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బలియా ప్రాంతం నుంచి అమన్ జైస్వాల్ ముంబై వచ్చాడు. నటన మీద ఆసక్తితో చాలా చిన్న వయసులోనే ప్రయత్నాలు ప్రారంభించాడు. తొలుత మోడలింగ్ చేశాడు. దానిని కెరీర్ గా ఎంచుకున్న తర్వాత నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నించాడు. సోనీ టీవీలో జనవరి 2021 నుంచి అక్టోబర్ 2023 వరకు టెలికాస్ట్ అయిన 'పుణ్య శ్లోక అహిల్య బాయి'లో యశ్వంత్ రావు ఫన్సే పాత్రలో నటించాడు.
రవి దూపే, శర్గున్ మెహతాల 'ఉదారియాన్'లో కూడా అమన్ జైస్వాల్ నటించాడు. అతని వయసు 22 సంవత్సరాలు మాత్రమే. చిన్న వయసులో తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో బాలీవుడ్ టీవీ ఇండస్ట్రీ అంతా విషాదంలో మునిగింది.
Also Read: సైఫ్ అలీ ఖాన్ మీద ఎటాక్ జరుగుతుంటే కరీనా ఎక్కడ ఉంది? కత్తిపోట్ల నుంచి ఐసీయూలో సర్జరీ వరకు...