గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana Konidela) ఇటీవలే తల్లదండ్రులైన సంగతి తెలిసిందే. జూన్ 20న హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి పాపకు జన్మనిచ్చింది. మెగా కోడలు ఉపాసన పిల్లల విషయంలో ఎంత కేరింగ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో ఓ ఇంటర్య్వూలో పిల్లల పెంపకం గురించి చెప్పుకొచ్చిన వీడియోలు వైరల్ అయ్యాయి. అలాగే ఆమెకు ఉన్న ష్యాషన్ సెన్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. ఉపాసన డెలివరీకు ముందు రోజు అపోలోకు వెళ్తున్నపుడు ఆమె ధరించిన టీ షర్ట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. ప్రసూతి సమయంలో ఆమె ఫ్యాషన్ సెన్స్ ఆకట్టుకునేలా ఉందంటూ ఆమె ధరించిన టీ షర్ట్ గురించి ఆరా తీస్తున్నారు నెటిజన్స్.
ఆ టీ షర్ట్ ధర రూ. 48 వేలు..
ఉపాసనకు ఫ్యాషన్ పట్ల ఉన్న ఎలాంటి అభిరుచి ఉందో అందరికీ తెలిసిందే. ఆమె ధరించే దుస్తులు కూడా అంతే కాస్ట్లీగా ఉంటాయి. డెలివరీ సమయంలో కూడా ఉపాసన అదే డ్రస్ సెన్స్ ను ఫాలో అయింది. డెలివరీకు ఒక రోజు ముందు ఆమె ఆసుపత్రికి చేరుకుంది. ఆ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఉపాసనను రామ్ చరణ్ చేయి పట్టుకొని జాగ్రత్తగా తీసుకెళ్తున్న దృశ్యాలు మనకు కనబడతాయి. అయితే ఉపాసన ష్యాషన్ సెన్స్ ను ఫాలో అయ్యేవారు మాత్రం ఆమె ధరించిన టీ షర్ట్ గురించి ఆరా తీసారు. ఆమె ధరించిన బేబీ పింక్ కలర్ టీ షర్ట్ గూచీ కంపెనీకు చెందినదిగా గుర్తించారు నెటిజన్స్. ఆ టీ షర్ట్ ధర అక్షరాలా రూ. 48 వేలు అని టాక్. ఇప్పుడు ఆ టీ షర్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు రమ్మంటే 2 లక్షలు అడుగుతావా? సుమన్‌పై శివనాగు ఫైర్
పింక్ కలర్ తో ముందే బేబీ హింట్ ఇచ్చారా?
మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అనే వార్త బయటకు రాగానే అందరిలోనూ ఆసక్తి మొదలైంది. ఆమె డెలివరీ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ మొదలైంది. జూన్ 20న ఉపాసన పండంటి పాపకు జన్మనిచ్చింది. అయితే పుట్టబోయేది అమ్మాయే అని వాళ్లకి ముందే తెలుసు అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. అందుకు తగిన లాజిక్ లను కూడా చెబుతున్నారు. ఉపాసన ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచీ ఎక్కువ సార్లు బేబీ పింక్ కలర్ డ్రస్ లే ధరించేదని చెప్పుకొస్తున్నారు. సీమంతం రోజు కూడా ఉపాసన పింక్ కలర్ డ్రెస్ ను ధరించింది. తర్వాత గతంలో ఉప్సీ – ఆర్సి అనే పార్టీని గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో కూడా ఉపాసన బేబీ పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించింది. ఇక డెలివరీకు ముందు రోజు ఆసుపత్రికి వెళ్తున్నపుడు కూడా బేబీ పింక్ కలర్ టీ షర్ట్ ను ధరించి పుట్టబోయేది అమ్మాయేనని హింట్ ఇచ్చిందని అంటున్నారు. ఏదేమైనా ఉపాసన ప్రతీసారి తన ష్యాషన్ సెన్స్ తో అందరి దృష్టినీ ఆకర్షిస్తుందనే చెప్పాలి.
Also Read: సోషల్ మీడియాలో చెర్రీ కూతురు ఫొటో లీక్? అసలు సంగతి ఇదీ!