కన్నడ నటి దివ్య స్పందన గుండెపోటుతో చనిపోయారంటూ పుకార్లు
కన్నడ నటి దివ్య స్పందన గుండెపోటుతో మృతి చెందారని పుకార్లు వచ్చాయి. సోషల్ మీడియాలో చాలా మంది RIP అంటూ పోస్ట్‌లు పెట్టారు. ఉన్నట్టుండి ఈ రూమర్స్‌ రావడం షాక్‌కి గురి చేసింది. శింబు, ధనుష్, సూర్యతో పలు సినిమాల్లో నటించారు. ఎంపీగానూ బాధ్యతలు నిర్వర్తించారు. కుత్తు రమ్య పేరుతో ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. ధనుష్‌తో పొల్లదవన్ సినిమాలో యాక్ట్ చేశారు. దివ్య స్పందన గుండెపోటుతో చనిపోయారంటూ కొందరు ట్వీట్‌లు కూడా పెట్టారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'జవాన్'పై మహేష్ బాబు ట్వీట్స్ - షారుఖ్ మూవీస్ అంటే అంత ఇష్టమా?
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన 'జవాన్' మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై ఏ రేంజ్ లో హైప్ క్రియేట్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ హైప్ తోనే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. 'పఠాన్' వంటి భారీ సక్సెస్ తరువాత షారుక్ ఖాన్ నటిస్తున్న సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ట్రైలర్ కూడా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో 'జవాన్' రూపంలో షారుక్ ఖాన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయం అనే మాట వినిపిస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


అనసూయ ఫోటోలకు నెటిజన్ దారుణమైన కామెంట్ - దిమ్మతిరిగే సమాధానం చెప్పిన రంగమ్మత్త
అనసూయ భరద్వాజ్. తెలుగు బుల్లితెరతో పాటు వెండితెరపై తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా తన పాపులారిటీని జబర్దస్త్ పెంచుకున్న ఆమె, ఆ తర్వాత బుల్లితెరను వదిలి వెండితెరపైకి అడుగు పెట్టింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తోంది. అయితే, నెటిజన్లతో నిత్యం ఆమెకు ఏదో రకంగా పంచాయితీ అవుతూనే ఉంటుంది. నెటిజన్ల చెత్త కామెంట్లు పెట్టడం, వాటికి అనసూయ కౌంటర్లు ఇవ్వడం కామన్ అయ్యింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ఓవర్సీస్‌లో షారుఖ్ క్రేజ్ - ఏకంగా 3,500 స్క్రీన్స్‌లో 'జవాన్' రిలీజ్!
కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్ - షారుక్ ఖాన్ కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'జవాన్' విడుదలకి ఇంకా ఒక్కరోజు సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఆడియన్స్ లో విపరీతమైన హైప్ ని క్రియేట్ చేసిన ఈ మూవీ కోసం షారుక్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో 'జవాన్' సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. దీంతో కచ్చితంగా ఈ మూవీకి ఎవరూ ఊహించిన విధంగా ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైన్డ్ గా రూపొందిన ఈ మూవీ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ స్కేల్ లో విడుదల కాబోతోంది. షారుక్ ఖాన్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ప్రభాస్‌తో మళ్ళీ సినిమా ఎప్పుడు? - అనుష్క ఏం చెప్పిందో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్, కథానాయిక అనుష్క శెట్టిలది సూపర్ డూపర్ హిట్ జోడీ. వాళ్ళిద్దరూ 'బిల్లా'లో మొదటి సారి జంటగా నటించారు. స్క్రీన్ మీద అనుష్క బికినీలో కనిపించిన మొదటి సినిమా కూడా అదే. బాక్సాఫీస్ బరిలో 'బిల్లా' ఆశించిన విజయం సాధించలేదు. కానీ, ప్రభాస్ - అనుష్క జోడీకి మంచి పేరు వచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)