అనసూయ భరద్వాజ్. తెలుగు బుల్లితెరతో పాటు వెండితెరపై తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా తన పాపులారిటీని జబర్దస్త్ పెంచుకున్న ఆమె, ఆ తర్వాత బుల్లితెరను వదిలి వెండితెరపైకి అడుగు పెట్టింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తోంది. అయితే, నెటిజన్లతో నిత్యం ఆమెకు ఏదో రకంగా పంచాయితీ అవుతూనే ఉంటుంది. నెటిజన్ల చెత్త కామెంట్లు పెట్టడం, వాటికి అనసూయ కౌంటర్లు ఇవ్వడం కామన్ అయ్యింది.

  


నెటిజన్ చెత్త కామెంట్, అనసూయ గట్టి కౌంటర్


తాజాగా అనసూయ ఇన్ స్టాలో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ టాప్ లో వయ్యారాలు పోతూ ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టగానే బాగా వైరల్ అయ్యాయి. ఆమె అభిమానులు బోలెడన్ని కామెంట్లు పెట్టారు. పాటివ్ కామెంట్స్ తో పాటు నెగెటివ్ కామెంట్స్ రావడం కామన్. అయితే, ఓ నెటిజన్ ఏకంగా బూతు కామెంట్ పెట్టాడు. ‘లం..’ అంటూ తీవ్ర పదజాలాన్ని వాడాడు. ఈ కామెంట్ పై అనసూయ తీవ్రంగా స్పందించింది. “మీరు వాళ్లతోనే ఉంటున్నారనుకుంటాగా, బాగా తెలిసినట్టు చెప్తున్నారు.. పాపం వాళ్ల కష్టంతో పెరుగుతున్నారా?’’ అని కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.






రీసెంట్ గా వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో అనసూయ పోస్ట్ చేశారు. దాంతో సోషల్ మీడియాలో నెగిటివిటీని తట్టుకోలేక కన్నీళ్ళు పెట్టుకున్నారని  అందరూ అనుకున్నారు. ఆ తర్వాత 'అరే ఏంట్రా మీరంతా?' అంటూ ఆమె కొత్త వీడియో పోస్ట్ చేయడంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొత్తంగా నిత్యం ఓ వివాదంతో వార్తల్లో నిలుస్తుంది అనసూయ.


యాంకర్ గా, నటిగా చక్కటి గుర్తింపు


న్యూస్ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ, నెమ్మదిగా బుల్లితెరపై రాణించింది. ‘జబర్దస్త్’ షోతో ఆమె రేంజి పెరిగిపోయింది. తన అందం చందాలతో పాటు చలాకీ మాటలతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంది. అమ్మడు గ్లామర్ ట్రీట్ కు కుర్రకారు ఫిదా అయ్యారు. కొన్ని సంవత్సరాల పాటు యాంకర్ గా బుల్లితెరను షేక్ చేసింది. ఈ మధ్యే ‘జబర్దస్త్’ షోకు గుడ్ బై చెప్పింది. సినిమాల్లోకి అడుగు పెట్టింది. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ‘రంగస్థలం’ చిత్రంలో రంగమ్మత్త పాత్రతో ఆకట్టుకున్న అనసూయ, ‘పుష్ప’ సినిమాలో దాక్షాయణిగా చేసి ఆకట్టుకుంది.  ప్రస్తుతం ‘పుష్ప2’ చిత్రంలోనూ నటిస్తోంది. సుమార్ ఈ చిత్రంలో ఆమె క్యారెక్టర్ ను మరింత హైలెట్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.  రీసెంట్ గా ఆమె నటించిన ‘విమానం’ చిత్రం విడుదలై చక్కటి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఓటీటీలోనూ ఆడియెన్స్ ను అలరించింది.     


Read Also: రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా పెళ్లి ముహూర్తం ఫిక్స్ - ఏడు అడుగులు వేసేది ఎక్కడంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial