రామ్ చరణ్ అరుదైన గౌరవం, ఆస్కార్‌ యాక్టర్స్ బ్రాంచ్​లోకి ఎంట్రీ!
‘RRR’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు రామ్ చరణ్. ఈ చిత్రంతో పలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. తాజాగా ఆయన మరో అరుదైన ఘనత సాధించారు. ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌లో చోటు సంపాదించుకున్నారు. ‘RRR’ చిత్రంలో రామరాజుగా అద్భుత నటన కనబర్చిన ఆయనకు ఈ బ్రాంచ్ లో చోటు కల్పిస్తూ అకాడమీ అవార్డ్స్ టీమ్ నిర్ణయం తీసుకుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


షారుక్ బర్త్ డే గిఫ్ట్ - ఫన్ అండ్ ఎమోషనల్​గా 'డంకీ' టీజర్, మీరు చూశారా?
బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కి ఓ సర్ ప్రైజ్ ని ప్లాన్ చేసింది 'డంకీ'(Dunki) మూవీ టీం. నవంబర్ 2 షారుక్ ఖాన్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్ కోసం 'డంకీ' నుంచి టీజర్​ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టీజర్ ఫ్యాన్స్​ని ఆకట్టుకుంటుంది. ఏడాది 'పఠాన్', 'జవాన్' వంటి సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.2000 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న షారుక్ ఖాన్ తాజాగా నటిస్తున్న చిత్రం 'డంకీ'(Dunki). ఈ మూవీతో ఎలాగైనా హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు షారుక్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'ఈగల్' కోసం డోస్ పెంచుతున్న రవితేజ - అదే జరిగితే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ!
మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యకాలంలో తన మార్క్ ఆఫ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ని వదిలేసి ప్రయోగాలు చేస్తున్నారు. అవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. రీసెంట్ టైమ్స్ లో రవితేజ చేసిన 'రామారావు ఆన్ డ్యూటీ', 'ఖిలాడి', 'రావణాసుర' లాంటి సినిమాలన్నీ ఈ కోవకు చెందినవే. వీటి తరువాత వచ్చిన 'ధమాకా' ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. డైరెక్టర్ త్రినాధరావు ఈ సినిమాలో రవితేజ మార్క్ ఆఫ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ లో చూపించాడు. అందుకే ధమాకా లో స్టోరీ పెద్దగా లేకపోయినా రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ తోనే సినిమా పెద్ద హిట్ అయింది. దీంతో తన తదుపరి చిత్రం ‘ఈగిల్’లో కామెడీ డోస్ కాస్త పెంచమని మూవీ టీం కి సూచనలు ఇచ్చినట్లు సమాచారం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


షారుఖ్ బర్త్ డే ట్రీట్, ఓటీటీలోకి వచ్చేసిన 'జవాన్' - అదనపు సన్నివేశాలతో స్ట్రీమింగ్, ఎక్కడంటే?
షారుక్ ఖాన్ ఫ్యాన్స్, ఓటీటీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. షారుక్ రీసెంట్ బ్లాక్ బస్టర్ 'జవాన్'(Jawan) తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. షారుక్ ఖాన్ బర్త్ డే సందర్భంగా కొన్ని స్పెషల్ సర్ప్రైజ్ లతో 'జవాన్' మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు. డీటెయిల్స్ లోకి వెళ్తే.. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, నయనతార తొలిసారి కలిసి నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ 'జవాన్'(Jawan). రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రంలో షారుక్ తండ్రి, కొడుకులుగా నటించి ఆకట్టుకున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


డైలాగ్స్ లేవు, డబ్బింగ్ లేదు, ‘తంగలన్’ కంప్లీట్ డిఫరెంట్ మూవీ - విక్రమ్
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఆయన ఏ సినిమా చేసిన దాని కోసం ఎంతో కష్టపడతారు. పాత్ర ఏదైనా ఒదిగిపోయి జీవిస్తారు. ‘అపరిచితుడు,’ ‘శివపుత్రుడు,’ ‘అపరిచితుడు,’ ‘రావణ్‌’ లాంటి చిత్రాలు ఆయనలోని నటుడికి నిలువెత్తు నిదర్శనాలు. త్వరలో ‘తంగలన్‘ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు నుంచి విడుదలైన టీజర్ ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతోంది. ఆయన గెటప్, నటన చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. గిరిజన నాయకుడిగా విక్రమ్ లుక్ చూసి షాక్ అవుతున్నారు ప్రేక్షకులు. టీజర్ ఆద్యంతం ఒక్కంటే ఒక్క మాట కూడా లేకపోవడం విశేషం. వాగులో నీళ్ళల్లో పారిన రక్తం, పామును విక్రమ్ రెండు ముక్కలు చేయడం, పోరాట సన్నివేశాలు చూసిన ప్రేక్షకులు అవాక్కవుతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)