ఓటీటీకి వచ్చేస్తోన్న పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఆడు జీవితం'
The Goat Life OTT Release Date and Streaming Update: మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ది గోట్ లైఫ్‌ (తెలుగులో ఆడు జీవితం). మార్చి 28న విడుదలైన ఈ సినిమా వరల్డ్‌ బాక్సాఫీసు వద్ద వసూళ్లు వర్షం కురిపించింది. మలయాళంలో అయితే ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచి పాజిటివ్‌ టాక్‌ దూసుకుపోయింది. పలితంగా అతితక్కువ టైంలో రూ. 100 గ్రాస్‌ వసూళ్లు చేసిన తొలి మాలీవుడ్‌ చిత్రంగా నిలిచింది. ఇక మొత్తం థియేట్రికల్‌ రన్‌లో ఆడు జీవితం వరల్డ్‌ వైడ్‌గా రూ.150కి పైగా గ్రాస్‌ వసూళ్లు చేసింది. దీంతో మలయాళంలో అత్యధిక వసూళ్లు చేసిన టాప్‌ చిత్రాల్లో 'ఆడు జీవితం' ఒకటిగా నిలిచింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


కన్నప్ప టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
కన్నప్ప (Kannappa Movie)... డేరింగ్ అండ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్. తెలుగులో, ఇతర దక్షిణాది భాషల్లో కొంత మంది హీరోలు కన్నప్ప కథను తెరకెక్కించారు. అయితే... ఇంటర్నేషనల్ లెవల్‌లో, భారీ ఎత్తున, అత్యంత ప్రతిషాత్మకంగా రూపొందిస్తున్నారు విష్ణు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వివిధ భాషల్లో అగ్ర తారలను సినిమాలో కీలక పాత్రలకు తీసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు. టీజర్ ఎప్పుడు విడుదల చేస్తున్నదీ అనౌన్స్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ఎలక్షన్ డే... మెగా డాటర్ నిహారిక మాజీ భర్త చైతన్య సెన్సేషనల్ పోస్ట్
తెలుగు చిత్రసీమ మద్దతు ఎవరికి ఉంది? ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టాలీవుడ్ ఎవరి వైపు నిలబడింది? వంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి పెద్దగా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం లేదు. జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు మెజారిటీ జనాలు మద్దతు పలికారు. మెగా ఫ్యామిలీని పక్కన పెడితే... ఆయనతో పని చేసిన హీరోయిన్లు, దర్శకులు చాలా మంది సోషల్ మీడియా వేదికగా పవన్, జనసేన పార్టీకి ఓటు వేయమని పిలుపు ఇచ్చారు. మరి, మాజీ మెగా అల్లుడి మద్దతు ఎవరికి ఉంది? నిహారిక మాజీ భర్త ఏమని చెబుతున్నారు? అంటే... ఎన్నికల రోజు సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్ట్ చూడాలి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


Allu Arjun: పవన్‌కు నా లవ్, సపోర్ట్ ఎప్పుడూ ఉంటాయ్
తనకు రాజకీయాలతో సంబంధం లేదని, తాను ఏ పార్టీకీ చెందిన వ్యక్తిని కాదని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) స్పష్టం చేశారు. ఏపీ ఎన్నికల ప్రచార సమయంలో ఈ స్టార్ హీరో వ్యవహరించిన తీరు సామాజిక మాధ్యమాల్లో పలు విమర్శలకు దారి తీసింది. పూర్తి వివరాల్లోకి వెళితే... (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ఇండస్ట్రీలో ఆడవారి రాత మారింది
Manisha Koirala About Heeramandi: సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హీరామండి’ వెబ్ సిరీస్ గురించే ప్రస్తుతం ప్రేక్షకులంతా మాట్లాడుకుంటున్నారు. స్వాతంత్ర్యం సమయంలో హీరామండి అనే రెడ్ లైట్ ఏరియాలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు భాన్సాలీ. తన డైరెక్షన్‌లో ప్రతీ ఫ్రేమ్‌ను రిచ్‌గా చూపించే సంజయ్ లీలా భన్సాలీ.. ‘హీరామండి’ని కూడా చాలా రిచ్‌గా ప్లాన్ చేశారు. ఇక ఇందులో నటించిన హీరోయిన్స్ కూడా సిరీస్‌ను మరికొందరు ప్రేక్షకులకు దీనిని రీచ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ‘హీరామండి’ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు మనీషా కొయిరాల. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)