The Goat Life OTT Release Date and Streaming Update: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ది గోట్ లైఫ్ (తెలుగులో ఆడు జీవితం). మార్చి 28న విడుదలైన ఈ సినిమా వరల్డ్ బాక్సాఫీసు వద్ద వసూళ్లు వర్షం కురిపించింది. మలయాళంలో అయితే ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ దూసుకుపోయింది. పలితంగా అతితక్కువ టైంలో రూ. 100 గ్రాస్ వసూళ్లు చేసిన తొలి మాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఇక మొత్తం థియేట్రికల్ రన్‌లో ఆడు జీవితం వరల్డ్ వైడ్‌గా రూ.150కి పైగా గ్రాస్ వసూళ్లు చేసింది. దీంతో మలయాళంలో అత్యధిక వసూళ్లు చేసిన టాప్ చిత్రాల్లో 'ఆడు జీవితం' ఒకటిగా నిలిచింది.
నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కి ఇంతటి భారీ విజయం అందుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. దాదాపు రెండు నెలల తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో వస్తుండటంతో మూవీ లవర్స్ అంతా ఖుష్ అవుతున్నారు. కాగా ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. ఇందుకోసం హాట్‌స్టార్ భారీగానే చెల్లించిందని టాక్. దీంతో ఇప్పుడు ఈ సినిమాను స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చేందుకు హాట్‌స్టార్ ప్లాన్ చేస్తుందట. మే 26 నుంచి డిజిటల్ ప్రీమియర్‌కు తీసుకురానుందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం.
బెన్యామిన్ రాసిన 'ఆడు జీవితం' (గోట్ డేస్) నవల ఆధారంగా బ్లెస్సీ ఈ సినిమాను తెరకెక్కించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో పాన్ ఇండియాగా విడుదలైంది. బతుకు దెరువు కోసం సౌదీ వెళ్లిన మలయాళీ యువకుడు నజీబ్ ఎడారి దేశంలో ఎన్ని కష్టాలు పడ్డాడేనేది 'ఆడు జీవితం' కథ. ఇందులో పృథ్వీరాజ్.. నజీబ్ అనే యువకుడి పాత్ర పోషించగా అతడి భార్య పాత్రలో అమలా పాల్ నటించింది. ఇక ఈ సినిమాను ప్రారంభించిన 16 ఏళ్లకు మూవీ రిలీజ్ అవ్వడం విశేషం. ఎప్పుడో 2008లో స్క్రిప్ట్ అనుకోగా ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయిపోవడానికి పదేళ్లు పట్టింది. 2008 నుంచి 2018 వరకు ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్‌ని జరుపుకుంది.
Also Read: 'మైదాన్' డిజాస్టర్‌పై స్పందించిన బోనీ కపూర్ - ఆర్‌ఆర్‌ఆర్, పఠాన్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు!
అనంతరం 2018లో సెట్స్‌పైకి రాగా స్లో స్లో షూటింగ్ జరుపుకుంటుంది. షూటింగ్ కోసం అరబ్ దేశాలకు వెళ్లిన మూవీ టీం కరోనా కారణంగా మూడు నెలల పాటు అక్కడే ఇరుక్కుంది. లాక్‌డౌన్ వల్ల వాయిదా పడ్డ ఈ మూవీ షూటింగ్ స్లో స్లోగా 2022లో పూర్తి చేసుకుంది. షూటింగ్ అనంతరం కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు ఏడాది కాలం పట్టింది. అలా ఫైనల్‌గా ఈ సినిమా 2024లో థియేటర్లోకి వచ్చిన సంచలన విజయం సాధించింది. ఆడు జీవితం బ్లాక్‌బస్టర్‌తో మూవీ టీం అంతా ఫుల్ ఖుష్ అయ్యింది. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించిందంటూ మేకర్స్, మూవీ టీం ఎమోషనల్ అయ్యింది.