కన్నప్ప (Kannappa Movie)... డేరింగ్ అండ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్. తెలుగులో, ఇతర దక్షిణాది భాషల్లో కొంత మంది హీరోలు కన్నప్ప కథను తెరకెక్కించారు. అయితే... ఇంటర్నేషనల్ లెవల్‌లో, భారీ ఎత్తున, అత్యంత ప్రతిషాత్మకంగా రూపొందిస్తున్నారు విష్ణు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వివిధ భాషల్లో అగ్ర తారలను సినిమాలో కీలక పాత్రలకు తీసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు. టీజర్ ఎప్పుడు విడుదల చేస్తున్నదీ అనౌన్స్ చేశారు.
మే 20న 'కన్నప్ప' టీజర్ విడుదల
Kannappa Movie Teaser: మే 20న... అంటే ఇవాళ్టికి సరిగ్గా వారం తర్వాత, వచ్చే సోమవారం 'కన్నప్ప' టీజర్ విడుదల చేయనున్నట్లు సోషల్ నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్'లో విష్ణు మంచు తెలిపారు. అదీ ఇక్కడ కాదు... కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival 2024)లో టీజర్ విడుదల చేస్తామని ఆయన ట్వీట్ చేశారు. ఈ వార్త చెబుతూ ఆయన విడుదల చేసిన పోస్టర్ సినిమాపై ఆసక్తి రేపింది. ఆ చేతిలో ఉన్న కత్తి డిజైన్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
Also Read: మెగా డాటర్ నిహారిక కొణిదెల మాజీ భర్త చైతన్య సెన్సేషనల్ పోస్ట్... జనసేనకు ఆయన వ్యతిరేకమా?
ప్రభాస్ తనకు నచ్చిన క్యారెక్టర్ చేస్తున్నాడు
'కన్నప్ప' సినిమాలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కీలక పాత్రలో కనువిందు చేయనున్న విషయం ప్రేక్షకులకు తెలుసు. ఇటీవల ఆయన చిత్రీకరణలో కూడా పాల్గొన్నారు. అయితే... ఆయన ఏ పాత్రలో కనిపిస్తారు? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో, మరీ ముఖ్యంగా రెబల్ స్టార్ అభిమానుల్లో ఉంది.
Also Read: అభిమాని గుండెలపై ఎన్టీఆర్ సంతకం - పోలింగ్ బూత్ వద్ద అరుదైన దృశ్యం
తొలుత తాను ఒక క్యారెక్టర్ చేయమని ప్రభాస్ (Prabhas)ను అప్రోచ్ అయితే... కథ అంతా విన్నాక మరొక క్యారెక్టర్ చేస్తానని చెప్పారని, తనకు నచ్చిన పాత్రను ప్రభాస్ చేస్తున్నారని ఇటీవల విష్ణు మంచు ఒక వీడియో విడుదల చేశారు. తనంతట తాను సినిమా అప్డేట్స్ ఇచ్చే వరకు ఊహాగానాలను నమ్మవద్దని చెప్పారు.
విష్ణు మంచు టైటిల్ పాత్రలో నటిస్తున్న 'కన్నప్ప' సినిమాలో ప్రభాస్ ఓ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇంకా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, లేడీ సూపర్ స్టార్ నయనతార, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, పద్మశ్రీ పురస్కార గ్రహీత - లెజెండరీ నటుడు - కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, శరత్ కుమార్, మధుబాల తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
'కన్నప్ప' సినిమాను మంచు ఫ్యామిలీకి చెందిన అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు (Mohan Babu) ప్రొడ్యూస్ చేస్తున్నారు. హిందీలో మహాభారత సిరీస్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకుడు. పరుచూరి గోపాల కృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ రచయితలు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తున్నారు.