Tollywood Stars cast their vote: పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టిన టాలీవుడ్ యంగ్ స్టార్స్... పిఠాపురంలో ఉప్పెన దర్శకుడు
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేశారు. జూబ్లీ హిల్స్ విమెన్స్ కాలేజీలో తన ఓటు హక్కును ఆయన వినియోగించుకున్నారు. చైతూ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App''దీప్తి ఓటు వేసింది. నేను కూడా'' అని నటి దివ్య శ్రీపాద సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. తాను ఓటు వేశానని, ప్రజలందరూ ఓటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
'ఉప్పెన' దర్శకుడు, త్వరలో రామ్ చరణ్ హీరోగా సినిమా చేయనున్న సానా బుచ్చిబాబు పిఠాపురం నియోజకవర్గంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
స్వర్గీయ కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి మొగల్తూరులో ఓటు వేశారు.
యువ హీరో సందీప్ కిషన్ తెలంగాణలో ఓటు వేశారు. ప్రజలను ఓటు వేయమని ఆయన రిక్వెస్ట్ చేశారు.
గుడివాడ టౌన్ హైస్కూల్లో దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి, ఆయన సతీమణి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్... ఆయన తండ్రి & ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ దంపతులు జూబ్లీ హిల్స్ లో ఓటు వేశారు.
ఓటు వేసిన ఆది సాయి కుమార్
హీరో తరుణ్ తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేశారు.
నటి హంసా నందినితో పాటు ఆయన తండ్రి సైతం ఈ రోజు ఓటు వేశారు.
ఓటు వేసి తన బాధ్యత నిర్వర్తించిన అల్లు శిరీష్
యాంకర్ ప్రదీప్ మాచిరాజు తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేశారు.
ఓటు వేసిన 'హనుమాన్' దర్శకుడు ప్రశాంత్ వర్మ
గుంటూరులోని పట్టాభిపురం బేసిక్ హై స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా, సిద్దార్థ్ గల్లా... ఆయన కుమారుడు, హీరో అశోక్ గల్లా.
ఓటు వేసిన హీరో, 'బిగ్ బాస్' ఫేమ్ శివాజీ
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం తన సొంతూరు రాయచోటిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.