Tollywood Celebrities Voting: ఓటు వేసిన టాలీవుడ్ సెలబ్రిటీలు - చిరు, మోహన్ బాబు to ఎన్టీఆర్, బన్నీ, అనన్య... ఫోటోల్లో చూడండి
పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి జూబ్లీ హిల్స్ క్లబ్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. ఆయనతో పాటు భార్య సురేఖ, పెద్దమ్మాయి సుష్మిత కొణిదెల సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appలెజెండరీ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో పాటు ఆయన పెద్ద కుమారుడు విష్ణు మంచు తిరుపతిలో ఓటు వేశారు.
ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దుబాయ్ నుంచి ఇండియా వచ్చారు. హైదరాబాద్ లో ఓటు వేశారు.
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా ఆయన సతీమణి అన్నా లెజినోవా మంగళగిరిలో ఓటు వేశారు.
ముంబైలో 'వార్ 2' చిత్రీకరణ చేస్తున్న మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆదివారం రాత్రి హైదరాబాద్ వచ్చారు. సోమవారం ఉదయం తల్లి శాలిని, భార్య ప్రణతితో కలిసి జూబ్లీ హిల్స్ లో ఓటు వేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోమవారం ఉదయం ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ప్రముఖ స్టైలిస్ట్, 'తెలుసు కదా' సినిమాతో దర్శకురాలిగా మారుతున్న నీరజా కోన గుంటూరులో ఓటు వేశారు. ఆమె తండ్రి కోన రఘుపతి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఓటు వేసిన అనంతరం వేలిపై సిరా చూపిస్తున్న పవన్ కళ్యాణ్
ఓటు వేసిన సుమంత్
'ఆదిత్య 369', 'యశోద' చిత్రాల నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, ఆయన కుమార్తె విద్య సోమవారం ఉదయం ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటు వేసిన తర్వాత వేలిపై సిరా చూపిస్తున్న అనన్యా నాగళ్ల
ఓటు వేసిన హీరో కళ్యాణ్ దేవ్