Jr NTR at Mumbai: ముంబై ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ సందడి - లోక్‌సభ ఎన్నికల కోసం హైదరాబాద్‌కు!
Jr NTR Spotted at Mumbai Airport: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ముంబైలోని ఖలినా ఎయిర్ పోర్టులో సందడి చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరేపు తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఆయన హైదరాబాద్ బయలుదేరినట్టు సమాచారం. ఈ క్రమంలో ముంబైలో ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తారక్ అక్కడ మీడియాకు కెమెరాలకు ఫోజులు ఇచ్చారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తారక్ లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది.
ఇందులో తారక్ డార్క్ బ్లూ టి-షర్ట్, బ్లాక్ జీన్స్‌లో మరింత యంగ్ కనిపిస్తున్నారు. కాగా 'వార్ 2' మూవీ షూటింగ్ నేపథ్యంలో గతనెల తారక్ ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇక వార్ 2 షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న తారక్ హైదరాబాద్ బయలుదేరారు. ఇక రేపు తెలంగాణలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యలో నేడు తారక్ హైదరాబాద్ బయలుదేరినట్టు తెలుస్తోంది.
కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర', 'వార్ 2' సినిమాలతో బిజీగా ఉన్నారు. దేవర మూవీ చిత్రీకరణ దాదాపు పూర్తి కాగా.. ప్రస్తుతం వార్ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.
కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న దేవర మూవీ ఆగస్ట్ 10న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మూవీ టీం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం 'దేవర' షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నట్టు సమాచారం. ఇటీవల గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ ఆ వెంటనే 'వార్ 2' సెట్లో అడుగుపెట్టారు.
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా వస్తున్న ఈచిత్రంలో తారక్ రా ఏజెంట్‌గా కనిపించనున్నారని టాక్. మరోవైపు 'దేవర'లో తారక్‌కు సంబంధించిన చిత్రీకరణ పూర్తయినట్టు తెలుస్తోంది.
ఇటీవల సైఫ్ అలీ ఖాన్‌కు సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే.