సగమే తీసుకున్న వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు - నిర్మాతకు లాభాలే ముఖ్యమంటూ


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ (Varun Tej Remuneration) ఎంత? ఆయన ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటారు? సాధారణంగా తీసుకునే ఆయన గానీ, ఇచ్చే నిర్మాతలు గానీ ఎప్పుడూ బయటకు చెప్పింది లేదు. అయితే... వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా సినిమా 'గాండీవధారి అర్జున' (Gandeevadhari Arjuna Movie). ఈ సినిమాకు హీరోతో పాటు దర్శకుడు న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) పూర్తిగా డబ్బులు తీసుకోలేదు. ఇద్దరూ హాఫ్ హాఫ్ రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నారు. ప్రవీణ్ సత్తారును ఈ విషయం గురించి ఏబీపీ దేశం అడగ్గా... (పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి)


పెళ్ళిళ్లలో డ్యాన్సులు చేసేదాన్ని, ‘బేబీ’ క్లైమాక్స్‌లో నిజంగా ఏడ్చేశా: వైష్ణవి చైతన్య


షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ స్టార్ట్ చేసి కేవలం ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది వైష్ణవి చైతన్య. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ తో ఈమె నటించిన 'బేబీ' సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో చెప్పనక్కర్లేదు. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.90 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ముఖ్యంగా సినిమాలో వైష్ణవి తన యాక్టింగ్ తో అందరి చేత ప్రశంసలు అందుకుంది. చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి అగ్ర తారలే ఈ తెలుగు అమ్మాయి నటనకి ఫిదా అయిపోయారు. ప్రస్తుతం 'బేబీ' సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న వైష్ణవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది (పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి).


వెన్నెల కిషోర్ హీరోగా ‘చారీ 111’ - బుర్రలేని స్పైగా నవ్విస్తాడట, ఇదిగో ప్రోమో!


కామెడీ చేయగలిగిన వాడు ఇంకా ఏదైనా చేయగలడు అని అంటుంటారు. ఇప్పటికే ఎంతోమంది కామెడియన్స్ ఆ మాటను నిజమే అని ప్రూవ్ చేశారు కూడా. కామెడియన్స్ నవ్వించినప్పుడు నవ్వే ప్రేక్షకులు.. వారి సీరియస్ పాత్రలకు కూడా అంతే కనెక్ట్ అవ్వగలరు. ప్రస్తుతం టాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ యంగ్ కామెడియన్స్ కొందరే ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు వెన్నెల కిషోర్. ఈయన ఒక పాత్ర చేస్తున్నాడంటే చాలు.. దానికి పూర్తిస్థాయిలో న్యాయం చేయడం మాత్రమే కాకుండా తన ఎక్స్‌ప్రెషన్స్‌తో, డైలాగులతో అందరినీ నవ్విస్తాడు కూడా. తాజాగా కిషోర్ హీరోగా ఎంట్రి ఇవ్వబోతున్నాడు (పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి).


రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’లో వైఎస్ షర్మిల ఎలా ఉందో చూశారా?


వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  రెండు భాగాలుగా ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో తొలి భాగానికి ‘వ్యూహం’ అనే పేరు పెట్టారు. రెండో భాగానికి ‘శపథం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే ‘వ్యూహం’ సినిమాకు సంబంధించి రెండు టీజర్లు విడుదలయ్యాయి. ఈ రెండూ ఏపీ పాలిటిక్స్ లో పెను దుమారం రేపాయి. రెండింటిలోనూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను వర్మ ఓ రేంజిలో టార్గెట్ చేశారు (పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి).


'ఖుషి' సెన్సార్ పూర్తి - విజయ్ దేవరకొండ, సమంత సినిమా రన్ టైమ్ ఎంతంటే?


'ది' విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన సినిమా 'ఖుషి' (Kushi Movie). మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. సెప్టెంబర్ 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో... పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతోంది. విడుదలకు పది రోజుల ముందు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి (పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి).  


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial