టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే తన తల్లితో కలిసి న్యూయార్క్ వెళ్లిన సమంత ఈనెల 20న అక్కడ నిర్వహించిన 'ఇండియా డే పెరేడ్’లో పాల్గొంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఇక పెరేడ్ తర్వాత అక్కడే ఉంటూ న్యూయార్క్ నగరాన్ని చుట్టేసింది. న్యూయార్క్ లో ఉన్న పర్యాటక ప్రదేశాలకు వెళ్తూ అక్కడి అందాలను ఆస్వాదించడంతోపాటు వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత న్యూయార్క్ లోని ఓ పార్కుకు వెళ్ళింది. అక్కడ కాసేపు వాకింగ్ చేస్తూ ప్రకృతి ఒడిలోనే సేద తీరింది.


అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "ఉదయం ఇలా ఉండాలి. నాకు నచ్చిన ప్రదేశం ఇది" అంటూ రాసుకొచ్చింది. అలా న్యూయార్క్ అందాలను ఆస్వాదిస్తున్న సమంతకు కాఫీ కరువైందట. సమంతకు కాఫీ అంటే చాలా ఇష్టం. రోజుకి ఎన్ని సార్లైనా కాఫీ తాగుతుంది. కానీ న్యూయార్క్ పర్యటనలో ఆమెకు కాఫీ కరువైపోయింది. ఎక్కడికి వెళ్లినా చిన్న కప్పులో కాఫీ ఇస్తున్నారు. అది సమంతకు సరిపోవటం లేదేమో, తాజాగా ఆమెకు ఎవరో జంబో సైజు కాఫీ ఇచ్చారు. దీంతో ఆనందంతో వెలిగిపోయిన సమంత.. ‘‘మొత్తానికి నన్ను అర్థం చేసుకునే వాళ్ళు దొరికారు’’ అంటూ కాఫీ చేతిలో పట్టుకున్న ఫోటోని తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది. మరి సమంత మనసుని అర్థం చేసుకుని ఆమెకు జంబో గ్లాస్ లో కాఫీ ఇచ్చిన వ్యక్తి ఎవరు? అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. అయితే సామ్ కూడా ఆ వ్యక్తి ఎవరనే విషయాన్ని చెప్పకుండా సస్పెన్స్ లో ఉంచింది.


ఇదిలా ఉంటే ఇటీవల సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పండిన విషయం తెలిసిందే కదా. ఈ వ్యాధికి సంబంధించిన చికిత్స కోసం కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆరోగ్యం కాస్త కుదుటపటడంతో పెండింగ్లో ఉన్న 'ఖుషి', 'సిటాడెల్' షూటింగ్స్ ని పూర్తి చేసింది. వీటి తర్వాత మరే ప్రాజెక్టుకు సమంత సైన్ చేయలేదు. ఓ ఏడాది పాటు సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రీసెంట్గా సమంత తన ఖుషి మూవీ కి సంబంధించి ఓ మ్యూజికల్ ఈవెంట్ లో పాల్గొంది. ఈ ఈవెంట్లో విజయ్ దేవరకొండ తో కలిసి స్టేజ్ పై డాన్స్ చేసి ఆకట్టుకుంది. ఆ తర్వాత ఖుషి ప్రమోషన్స్ లో పాల్గొనలేదు.


తన ఆరోగ్యం బాలేదని , ప్రమోషన్స్ కి రాలేనని మూవీ టీమ్ కి చెప్పిందట. కానీ ఇప్పుడు మాత్రం న్యూయార్క్ లో వెకేషన్ అంటూ ఎంజాయ్ చేస్తోంది. ఇదే విషయంలో సమంతను నెటిజన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ కి రమ్మంటే, ఆరోగ్యం బాలేదని చెప్పి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నావా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన 'ఖుషి' సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.


Also Read : 'టిల్లు స్క్వేర్'లో రాధిక ఎంట్రీ - సిద్దుకు ఊహించని ట్విస్ట్ ఇస్తుందట!




Join Us on Telegram: https://t.me/abpdesamofficial