విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా చంద్రయాన్ 3 పై చేసిన ఓ ట్వీట్ వివాదాస్పరంగా మారిన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఆయనపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. ఆయన చేసిన ట్వీట్ పై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో తరచూ ప్రధాని నరేంద్ర మోదీని, అలాగే బీజేపీ పార్టీ విధానాలపై విమర్శలు చేసే ప్రకాష్ రాజ్ తాజాగా చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి పెట్టిన పోస్టుతో చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆయన పై నెగిటివ్ కామెంట్స్ రాగా.. తాజాగా ప్రకాష్ రాజ్ పై ఏకంగా పోలీస్ కేసు నమోదయింది. ఆ వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని భాగల్ కోట్ జిల్లా బానహాట్టి పోలీస్ స్టేషన్లో హిందూ సంఘానికి చెందిన కొందరు నేతలు ప్రకాష్ రాజ్ పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.


చంద్రయాన్ 3 ప్రయోగంపై ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్స్ పై హిందూ సంఘ నేతలు  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనపై కేసు వేశారు. ఇందులో భాగంగానే ప్రకాష్ రాజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ బుధవారం సాయంత్రం చంద్రుడి ఉపరితలంపై కాలు మోపనున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రయోగానికి సంబంధించి ఆదివారం రోజున ప్రకాష్ రాజ్ తన సోషల్ మీడియాలో వేసిన ఓ ట్వీట్ నేటిజన్స్ నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. మన దేశం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషిని ప్రకాశ్ రాజ్ అవమానిస్తున్నారంటూ ఆయనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఆదివారం రోజున ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్లో కార్టూన్ ను పోస్ట్ చేస్తూ, బ్రేకింగ్ న్యూస్ చంద్రుడిపై చంద్రయాన్ 3 తీసిన తొలి ఫోటో ఇదే అంటూ యాక్షన్ పెట్టారు. ఇక ఆ కార్టూన్ లో ఓ వ్యక్తి లుంగీ కట్టుకొని, టీ పోస్తున్నట్లు ఉంది. దీంతో ప్రధాని నరేంద్ర మోదిని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ ఈ పోస్టు పెట్టాడని సోషల్ మీడియాలో నెటిజెన్స్ ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని, అలాగే దేశానికి ప్రతిష్ట తెచ్చి పెట్టే చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ప్రకాష్ రాజ్ ఇలా అవమానిస్తూ విమర్శించడం సరికాదని నెటిజన్లు ఆయనపై విరుచుకుపడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ప్రకాష్ రాజ్ పై ట్రోలింగ్ మొదలైంది. ట్వీట్ వైరల్ కావడం, ప్రకాష్ రాజ్ పై ట్రోలింగ్ కూడా ఎక్కువ అవ్వడంతో ఆ ట్వీట్ పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.






ద్వేషించే వారికి అంతా ద్వేషమే కనిపిస్తుందని, అది ఆర్మ్ స్ట్రాంగ్ కాలం నాటి జోక్ అని, అది అర్థం చేసుకోకుండా ఎవరికి వారు విమర్శలు చేస్తే ఎలా అని, తాను కేరళ చాయ్ వాలాను ఉద్దేశించి మాత్రమే ఆ పోస్ట్ చేశానని, మీరు ఏ చాయ్ వాలాను అనుకుంటున్నారో? అంటూ మరోసారి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దీంతో అధి కాస్త మరింత వివాదంగా మారడంతో తాజాగా ఆయనపై పోలీస్ కేసు సైతం నమోదయింది. మరి దీనిపై ప్రకాష్ రాజ్ స్పందిస్తారా? ఒకవేళ స్పందిస్తే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందనేది చూడాలి.


Also Read : అది సెంటిమెంట్ కాదు - 'ఆర్ఎక్స్ 100', 'బెదురులంక' మధ్య కో ఇన్సిడెన్స్ : హీరో కార్తికేయ ఇంటర్వ్యూ






Join Us on Telegram: https://t.me/abpdesamofficial