ఆగస్టులో 'భైరవద్వీపం' రీ రిలీజ్ - బాలకృష్ణ ఫ్యాన్స్ రెడీనా!


గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రయోగాలకు ఎప్పుడూ వెనుకాడలేదు. ఆయనకు అందగాడు ఇమేజ్ ఉన్నప్పుడు, కమర్షియల్ కథానాయకుడిగా వరుస విజయాలతో మాంచి జోరు మీద ఉన్నప్పుడు క్యారెక్టర్ కోసం సిల్వర్ స్క్రీన్ మీద అందవిహీనంగా కనిపించడానికి వెనుకడుగు వేయలేదు. ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. అందులో 'భైరవ ద్వీపం' ఒకటి. ఇప్పుడు ఆ సినిమా మళ్ళీ థియేటర్లలోకి రానుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).


పవన్ ఫ్యాన్స్‌కు అలర్ట్ - ఆలస్యంగా 'బ్రో' ప్రీ రిలీజ్ వేడుక, ఎందుకంటే?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం 'బ్రో'. సముద్రఖని దర్శకుడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ఈ చిత్రానికి టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కించాయి. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ వేడుకకు ఏర్పాట్లు జరిగాయి. అయితే... ఓ చిన్న ట్విస్ట్ ఉంది. ఈవెంట్ కొంచెం ఆలస్యంగా స్టార్ట్ కానుంది. ఎందుకంటే... (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


ఐకాన్ స్టార్ అదిరేటి రికార్డ్ - ఆ విషయంలో ఇండియాలోనే తొలి సెలబ్రిటీగా బన్నీ


టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ఫ’ సినిమా దేశవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ కు కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ మూవీలో అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కేవలం సినిమాల్లోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో విభిన్నంగా ఉంటారు బన్నీ. ఆయన స్టైల్, డ్రెస్ సెన్స్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఎప్పటికప్పుడు లుక్స్ ను మారుస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తారాయన. అభిమానులు కూడా ఆయన్ను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. అందుకే ఆయనకు సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ ఎక్కువ. తాజాగా సోషల్ మీడియాలో మరో రికార్డు సృష్టించారు (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


ఈ వారం థియేటర్లు - ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే - ఓ లుక్ వేసేయండి!


ప్రతీ శుక్రవారం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పదుల సంఖ్యలో సినిమాలు థియేటర్లలో విడుదల అవుతూనే ఉంటాయి. గత రెండు వారాలుగా చిన్న సినిమాలు ఎక్కువగా థియేటర్లలో విడుదల అవుతూ వచ్చాయి. అయితే జులై చివరి వారంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా విడుదల కావడంతో ఈ వారం ధియేటర్లలోకి వచ్చే సినిమాల సంఖ్య తగ్గింది. మరోవైపు ఓటీటీలో కూడా పలు సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఈ వారంలో థియేటర్లు, ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాల లిస్ట్ ఏంటో ఓ లుక్ వేసేయండి (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


నేను అల్లు అర్జున్‌కు వీరాభిమానిని: 'ఎల్జీఎం' ఈవెంట్‌లో ధోని భార్య సాక్షి


స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, అతని భార్య సాక్షి ధోని.. ధోని ఎంటర్‌ టైన్‌మెంట్‌ పతాకంపై తమిళంలో 'ఎల్‌జీఎం(లెట్స్‌ గెట్‌ మ్యారీ)'అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా జూలై 24న హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో.. సాక్షి ధోని ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. తాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి వీరాభిమానిని అని, అతని సినిమాలు చూస్తూ పెరిగానని వెల్లడించారు. సినిమా నిర్మాత సాక్షి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).





ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial