దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) తన పంథా మార్చారు. మాస్ అండ్ ఇంటెన్స్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. సాధారణంగా ఆయన సినిమాలు అంటే కుటుంబ అనుబంధాలు, నేపథ్యాలు గుర్తుకు వస్తాయి. 'కొత్త బంగారు లోకం' నుంచి 'బ్రహ్మోత్సవం' వరకు ఆ పంథాలో చిత్రాలు తీశారు. వాటి మధ్యలో వచ్చిన వరుణ్ తేజ్ 'ముకుంద'లో రాజకీయాల ప్రస్తావన ఉంటుంది. కానీ, అందులోనూ ప్రేమకథకు ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. 'నారప్ప'తో మాస్ బాట పట్టిన ఆయన... 'పెద్ద కాపు'తో రాజకీయ నేపథ్యంలో మాస్ మూవీ తీశారు.
'పెద కాపు'... న్యూ ఏజ్ పొలిటికల్ డ్రామా!
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ద్వారకా క్రియేషన్స్ సంస్థ తెరకెక్కిస్తోన్న సినిమా 'పెద్ద కాపు' (Peddha Kapu Movie). మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ అడ్డాల ఓ ప్రధాన పాత్ర పోషించారు.ఇది న్యూ ఏజ్ పొలిటికల్ డ్రామా!
నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన 'అఖండ'తో ద్వారకా క్రియేషన్స్ సంస్థ భారీ విజయం అందుకుంది. దానికి ముందు కూడా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'జయ జానకి నాయక' తీశారు. ఇప్పటి వరకు అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి, తొలిసారి తన బంధువును హీరోగా పరిచయం చేస్తూ సినిమా చేశారు.
జూలై 27న 'చనువుగా చూసిన' సాంగ్!
'పెద్ద కాపు' సినిమాలో తొలి పాట 'చనువుగా చూసిన...' (Chanuvuga Chusina Song)ను ఈ గురువారం (జూలై 27న) విడుదల చేస్తున్నారు. హీరో హీరోయిన్లపై ఈ పాటను తెరకెక్కించారు. ఇంతకు ముందు శ్రీకాంత్ అడ్డాల సినిమాలకు మ్యూజిక్ అందించిన మిక్కీ జె మేయర్ ఈ సినిమాకూ పని చేస్తున్నారు. 'పెద్ద కాపు'లో అన్ని పాటలకు రాజు సుందరం కొరియోగ్రఫీ అందించారు.
'అరెరే అరెరే తనవాటమే
అసలే పడదే మొహమాటమే
పలుచగా వేసినా...
పావడ గోడ దాటినా...
జరపదు ఎందుకో?'
అంటూ సాగిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. అనురాగ్ కులకర్ణి, చైత్ర అంబడిపూడి పాడిన ఈ పాటకు కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించారు.
Also Read : వెంకటేష్ vs నాని vs నితిన్ vs సుధీర్ బాబు... క్రిస్మస్‌కు టాలీవుడ్ హీరోల పాన్ ఇండియా పోటీ
ఆగస్టు 18న 'పెద్ద కాపు' విడుదల
ఆల్రెడీ విడుదల చేసిన 'పెద్ద కాపు' టీజర్ మీద ప్రేక్షకుల దృష్టి పడింది. ఆంధ్రుల ఆత్మ గౌరవం గురించి విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేసిన రాజకీయ ప్రసంగంతో ఆ టీజర్ మొదలైంది. ఇద్దరు శక్తివంతమైన వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్న గ్రామంలో సాధారణ వ్యక్తి పాలన చేపట్టడం అనేది ఈ సినిమా కథాంశం. సంభాషణలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. గ్రామ నాయకులుగా రావు రమేష్ , ఆడుకలం నరేన్ పవర్ ఫుల్ గా కనిపించారు. తనికెళ్ల భరణి, నాగబాబు ప్రజన్స్ ఆకట్టుకుంది.
Also Read : డీఎస్పీ గట్టిగా కొట్టాడుగా - ఒక్క దెబ్బకు మళ్ళీ లెక్కలు సెట్ అంతే!
శ్రీకాంత్ అడ్డాల ప్రధాన పాత్రలో... విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, నాగ బాబు, తనికెళ్ల భరణి, బ్రిగడ సాగా, రాజీవ్ కనకాల, అనుసూయ, ఈశ్వరి రావు, నరేన్ తదితరులు ఇతర తారాగణం. 'పెద్ద కాపు' చిత్రానికి కళ : జిఎం శేఖర్, పోరాటాలు : పీటర్ హెయిన్స్, కూర్పు : మార్తాండ్ కె వెంకటేష్, నృత్యాలు : రాజు సుందరం, ఛాయాగ్రహణం : చోటా కె నాయుడు, సంగీతం : మిక్కీ జె మేయర్, నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి, రచన - దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial