Kanguva: స్టార్ హీరో సూర్య చివరిగా ‘విక్రమ్’ సినిమా క్లైమాక్స్ లో కనిపించారు. తాజాగా ఆయన ‘కంగువ’ అనే భారీ పీరియాడికల్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో హీరో సూర్య యుద్ద వీరుడుగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల అయిన ప్రచార చిత్రాలు ఆకట్టుకోగా ఇటీవల విడుదల అయిన గ్లింప్స్ వీడియో మూవీపై అంచనాలను భారీగా పెంచేసింది. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ వీడియో మరో అరుదైన రికార్డును సృష్టించింది. ఈ సినిమా గ్లింప్స్ వీడియోను సూర్య పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ వీడియో విడుదల అయిన 24 గంట్లో రికార్డు స్థాయిలో వ్యూస్ సంపాదించుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.
‘పుష్ప 2’ తర్వాత ‘కంగువ’ సినిమానే
ఇప్పటి వరకూ ఇండియాలో విడుదల అయిన టీజర్లలో మొదటి 24 గంటల్లో 22 మిలియన్లు పైగా వ్యూస్ సాధించిన సినిమాల్లో మొదటి సినిమాగా ‘పుష్ఫ 2’ టీజర్ రికార్డు సృష్టించింది. ఇప్పుడు తాజాగా హీరో సూర్య నటించిన ‘కంగువ’ సినిమా టీజర్ వీడియో విడుదల అయిన 24 గంట్లో 22 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాల్లో రెండో సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఇప్పటికీ ఈ సినిమా యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇప్పటికీ మిలియన్స్ వ్యూస్ తో దూసుకెళ్తోంది ‘కంగువ’. ఇది చూసిన సూర్య ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీజర్ లోనే ఇలా ఉంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఊహించుకుంటూ టీజర్ ను షేర్ చేస్తున్నారట ఫ్యాన్స్.
ఇక గ్లింప్స్ వీడియోలో సూర్య నటనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. టీజర్ లో విజువల్స్, మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉన్నాయని టాక్. ఇక ఈ సినిమా పిరియాడికల్ తో పాటు ప్రస్తుత కాలంలో కూడా జరుగుతున్నట్టు చూపిస్తారని అంటున్నారు. ఇందులో సూర్య అరణ్యయోధుడిలా కనిపిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సూర్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతోన్న మూవీ ఇదే. మొత్తం పది భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారట మేకర్స్. ఇక ఈ సినిమాలో దిశా పటాని, DOP నటరాజ్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, ఆనందరాజ్, రవి రాఘవేంద్ర, KS రవికుమార్, BS అవినాష్, కోవై సరళ కూడా కనిపించనున్నారు.
ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న మూవీ టీమ్ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌తో మిగిలిన భాగాలను చిత్రీకరించడానికి వచ్చే నెలలో బ్యాంకాక్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అలాగే ఈ సినిమాను 3డి లో విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాదే మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో సూర్య ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.
Also Read: ‘కల్కి 2898 ఏడీ’లో నటిస్తున్నానంటే ప్రభాస్ నమ్మలేదు: కమల్ హాసన్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial