Kamal Haasan: ఇండియాలో భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రాల్లో ‘కల్కి 2898 ఏడీ’ ఒకటి. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని ఒక డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో సుమారు రూ.600 కోట్ల బడ్జెట్ తో సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు నాగ్ అశ్విన్. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తుండగా మెయిన్ విలన్ పాత్రలో కమల్ హాసన్ నటిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ వీడియోతో మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయనే చెప్పాలి. అయితే ఈ మూవీలో కమల్ హాసన్ కూడా నటిస్తున్నారని చాలా రోజుల వరకూ ఎవరికీ తెలియలేదు. ఇటీవల అమెరికాలో జరిగిన ఈవెంట్ లో కమల్ మాట్లాడుతూ తాను ఈ సినిమాలో నటిస్తున్నానంటే హీరో ప్రభాస్ కూడా నమ్మలేదంటూ మూవీలో తన పాత్ర గురించి చెప్పుకొచ్చారు కమల్. కమల్ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


నేను కూడా ఉన్నానంటే ప్రభాస్ నమ్మలేదు: కమల్ హాసన్


‘కల్కి 2898 ఏడీ’ లో కమల్ హాసన్ మెయిన్ విలన్ గా నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మూవీ టీమ్ అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అంతకంటే ముందు కమల్ హాసన్ మూవీలో తన రోల్ పై హింట్ ఇస్తూ వస్తున్నారు. అమెరికాలో జరిగిన ఈవెంట్ లో కమల్ లోకల్ మీడియాతో మాట్లాడుతూ తాను మూవీలో నటించడం గురించి చెప్పుకొచ్చారు. తాను ఈ సినిమాలో భాగమయ్యానంటే ముందు ఎవరూ నమ్మలేదని చెప్పారు కమల్. అంతెందుకు హీరో ప్రభాస్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాను అంటే నమ్మలేదని చెప్పారు. అమెరికాలో జరిగిన ఈవెంట్ లో ప్రభాస్ తన చెయి పట్టుకొని థ్యాంక్స్ చెప్పారని తెలిపారు. ‘‘మీరు ఈ సినిమాలో నటిస్తున్నారంటే ముందు నమ్మలేదు, మూవీ టీమ్ మిమ్మల్ని ఒప్పించారంటే నాకింకా ఆశ్చర్యంగానే ఉంది’’ అని కమల్ తో అన్నారట ప్రభాస్. 


అందుకే ఈ సినిమాలో నటించడానికిి ఒప్పుకున్నాను..


‘కల్కి 2898 ఏడీ’ సినిమా చాల ప్రత్యేకమైనదని అన్నారు కమల్ హాసన్. కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతీయులు పురాణాలను ఫాలో అవుతున్నాం. అలాంటి పురాణాల గొప్ప తనాన్ని తెలియజేయడం కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అందుకే ఈ సినిమాలో తానూ ఒక భాగం అవ్వడం సంతోషంగా ఉందన్నారు. అంతకముందు కార్యక్రమంలో మాట్లాడిన కమల్.. ఒక సినిమాకు హీరో ఎంత ముఖ్యమో విలన్ కూడా అంతే ముఖ్యం. అందుకే ప్రతినాయకుడిగా కనిపించడానికి ఓకే చేశానని అన్నారు.


ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోణ్ కూడా నటిస్తోంది. అలాగే అమితాబ్ బచ్చన్, దిశా పటానీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  నాగ్ అశ్విన్ ఈ సినిమాను పురాణాల బ్యాక్డ్రాప్ లో ఓ సరికొత్త సైన్స్ ఫిక్షన్ మూవీగా తీర్చిదిద్దారు. వైజయంతీ మూవీస్ పతాకం పై ఈ మూవీ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Also Read: అసలు ఎంతమంది భగవద్గీతను చదివారు? ‘ఓపెన్ హైమర్’ వివాదంపై ఆర్జీవి సంచలన ట్వీట్!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial