ప్రతీ శుక్రవారం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పదుల సంఖ్యలో సినిమాలు థియేటర్లలో విడుదల అవుతూనే ఉంటాయి. గత రెండు వారాలుగా చిన్న సినిమాలు ఎక్కువగా థియేటర్లలో విడుదల అవుతూ వచ్చాయి. అయితే జులై చివరి వారంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా విడుదల కావడంతో ఈ వారం ధియేటర్లలోకి వచ్చే సినిమాల సంఖ్య తగ్గింది. మరోవైపు ఓటీటీలో కూడా పలు సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఈ వారంలో థియేటర్లు, ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాల లిస్ట్ ఏంటో ఓ లుక్ వేసేయండి.
ఈ వారం థియేటర్లలో విడుదల అయ్యే సినిమాలు..
‘బ్రో’..
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తోన్న సినిమా ‘బ్రో’. తమిళ్ లో సూపర్ హిట్ సాధించిన మూవీ ‘వినోదయ సిత్తం’కు ఇది తెలుగు రిమేక్. దీనికి సముద్రఖని దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియా వారియర్, బ్రహ్మానందం, సముద్రఖని ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ జులై 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘స్లమ్ డాగ్ హస్బెండ్’
నటుడు సంజయ్ రావు హీరోగా ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటించిన సినిమా ‘స్లమ్ డాగ్ హస్బెండ్’. ఈ సినిమాకు ఏ ఆర్ శ్రీధర్ దర్శకుడు. బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటించారు. జాతకంలో దోషం ఉన్న ఓ యువకుడు కుక్కను పెళ్లి చేసుకోవడంతో అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే కథ. ఈ మూవీ జులై 29 న విడుదల కానుంది.
'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ'
బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, అలియా భట్ కలిసి నటించిన మూవీ 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ'. ఈ సినిమాను కరణ్ జోహార్ తెరకెక్కించారు. ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీను కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జులై 28 న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ వారం ఓటీటీలో విడుదల అయ్యే సినిమాలు/వెబ్ సిరీస్ లు ఇవే
నెట్ ఫ్లిక్స్ లో..
- డ్రీమ్(కొరియన్ మూవీ) - జులై 25
- మామన్నన్ - జులై 27 (తెలుగు/తమిళ్)
- పారడైజ్(హాలీవుడ్) - జులై 27
- హిడెన్ స్ట్రైక్(హాలీవుడ్) - జులై 27
- హ్యాపీనెస్ ఫర్ బిగినెర్స్(హాలీవుడ్) - జులై 27
- హౌ టు బికమ్ ఎ కల్ట్ లీడర్ - జులై 28
అమెజాన్ ప్రైమ్ లో..
- రెజీనా(తెలుగు డబ్బింగ్) - జులై 25
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో..
- ఆషిఖానా (హిందీ సిరీస్) - జులై 24
సోనీ లీవ్ లో..
- ట్విస్టెడ్ మెటల్(వెబ్ సిరీస్) - జులై 28
బుక్ మై షోలో..
- జస్టిస్ లీగ్: వార్ వరల్డ్(యానిమేషన్ మూవీ) - జులై 23
- ట్రాన్స్ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్(హాలీవుడ్) - జులై 28
- ద ఫ్లాష్(హాలీవుడ్) - జులై 27
- జియో సినిమాలో..
- లయనెస్(హాలీవుడ్) - జులై 23
- కాల్ కూట్(హిందీ) - జులై 27
- మనోరమా మాక్స్ లో..
- కొళ్ల(మలయాళం) - జులై 27
Also Read: ఆ హీరో పెదాలు పగిలేలా ముద్దుపెట్టిన కంగనా? హృతిక్ తర్వాత అతనా అంటూ క్వీన్ సెటైర్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial