Allu Arjun: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ఫ’ సినిమా దేశవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ కు కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ మూవీలో అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కేవలం సినిమాల్లోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో విభిన్నంగా ఉంటారు బన్నీ. ఆయన స్టైల్, డ్రెస్ సెన్స్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఎప్పటికప్పుడు లుక్స్ ను మారుస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తారాయన. అభిమానులు కూడా ఆయన్ను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. అందుకే ఆయనకు సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ ఎక్కువ. తాజాగా సోషల్ మీడియాలో మరో రికార్డు సృష్టించారు. 


ఇండియాలో తొలి సెలబ్రెటీగా రికార్డు..


అల్లు అర్జున్ కు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆయనకు కోట్లాది మంది ఫాలోవర్స్ ఉండగా. తాజాగా మరో రికార్డు సృష్టించారు ఐకాన్ స్టార్. ట్విట్టర్ కు పోటీగా మార్క్ జుకర్ బర్గ్ ‘థ్రెడ్స్’ అనే యాప్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ యాప్స్ ను మిలియన్స్ లో డౌన్లోడ్ లు చేసుకున్నారు. ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా థ్రెడ్స్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే ఆయన యాప్ ను డౌన్లోడ్ చేసుకున్న కొద్ది రోజుల్లోనే వన్ మిలియన్స్ మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు. దీంతో ఆ థ్రెడ్స్ యాప్ లో వన్ మిలియన్ ఫాలోవర్స్ ను సాధించిన తొలి ఇండియన్ గా అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు. దీంతో ఆయన అభిమానులు ‘తగ్గేదేలే’ అని కామెంట్లు చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


‘పుష్ప 2’ లో బిజీగా అల్లు అర్జున్..


‘పుష్ఫ’ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఈ మూవీ తర్వాత ఆయన దేశవ్యాప్తంగా ఉన్న అభిమానుల సంఖ్య పెరిగింది. ఈ మూవీ తర్వాత ఆయన ‘పుష్ప 2’ లో షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా మొదటి పార్ట్ కంటే భారీ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన కొన్ని వీడియోలు లీక్ అవ్వడంతో మూవీ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. 


‘పుష్ప 2’ డైలాగ్ లీక్ చేసిన బన్నీ..


ఇటీవల ‘బేబీ’ మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు అల్లు అర్జున్. ఈ సందర్భంగా మూవీ దర్శకుడు సాయి రాజేష్ ను అభినందించారు. అలాగే మూవీలో నటించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లను కూడా అభినందించారు. ఈ సందర్భంగా అభిమానుల కోరిక మేరక్ ‘పుష్ఫ 2’ మూవీలోని ఓ డైలాగ్ ను లీక్ చేశారు. ‘'ఈడంతా జరిగేది ఒక్కటే రూల్ మీద జరుగుతుండాది.. పుష్ప గాడి రూల్’' అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేసింది. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. మరి మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.     


Also Read: ఆ విషయంలో ‘పుష్ప 2’ తర్వాత ‘కంగువ’నే ఇండియాలో టాప్!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial