పేరుకు తగ్గట్టే సముద్రం ఓపెన్ సీన్ తో మొదలైంది ‘మహా సముద్రం’ట్రైలర్. ఇంటెన్స్ సన్నివేశాలతో ఉత్కంఠ రేపేలా ఉంది. శర్వానంద్, సిద్ధార్ధ్ హీరోలుగా చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ చూసిన కార్తికేయ డైరెక్టర్ అజయ్ భూపతిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఆయన డైరెక్షన్లో గతంలో ఆర్ఎక్స్ 100 సినిమా చేశారు కార్తికేయ. ఆ సినిమాతో పోలుస్తూ అజయ్ భూపతిని ఉద్దేశించి ‘
సర్ మహాసముద్రం ట్రైలర్ ముందు ఆర్ఎక్స్ 100 చాలా చిన్నగా అనిపిస్తోంది. కచ్చితంగా మరో ట్రెండ్ సెట్టర్ సినిమాను చూడబోతున్నాం’అని ట్వీట్ చేశాడు.
మహాసముద్రంలో హీరోయిన్లుగా అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యయేల్ నటిస్తున్నారు. రావురమేష్, జగపతి బాబు కీలకపాత్రలు చేస్తున్నారు. ఈ మొత్తం ట్రైలర్ చూశాక అందరికీ గుర్తుండిపోయే డైలాగ్ సిద్ధార్ధ్ చెప్పే ‘మీరు చేస్తే నీతి, మేము చేస్తే బూతా’అన్నదే. అన్నట్టు ఇందులో కెజీఎఫ్ విలన్ గరుడ రామ్ కూడా విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నేపథ్య సంగీతం అదిరిపోయింది.
దర్శకుడు అజయ్ భూపతి మొదటి సినిమా ఆర్ఎక్స్ 100. దాని తరువాత మహాసముద్రం చేస్తున్నారు. మొదటిసినిమాలో కార్తికేయ హీరోగా నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వారిద్దరికి టాలీవుడ్ మంచి ప్రశంసలతో పాటూ గుర్తింపు దక్కింది. కార్తికేయ తొలి చిత్రం ‘ప్రేమతో మీ కార్తీక్’.ఆ సినిమా అట్టర్ ఫ్లాపయ్యింది. అతనికి లైఫ్ ఇచ్చిన సినిమాగా ఆర్ఎక్స్100నే చెప్పుకుంటారు.