Tiger Nageswara Rao Review : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన సినిమా 'టైగర్ నాగేశ్వర రావు'. ఇది ఆంధ్రా రాబిన్ హుడ్ అని పేరు పొందిన స్టూవర్టుపురం నాగేశ్వర రావు (Stuartpuram Nageswara Rao) బయోపిక్. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి, ఈ సినిమా టాక్ ఎలా ఉంది? ఎన్నారై ఆడియన్స్ సినిమా గురించి ఏమంటున్నారు? అనేది చూస్తే... 


మాస్ మహారాజా అభిమానులకు గూస్ బంప్స్ గ్యారెంటీ!
Tiger Nageswara Rao First Review : 'టైగర్ నాగేశ్వర రావు' గురించి చెప్పే ముందు ప్రతి ఒక్కరు సినిమాలో ఫస్ట్ ఫైట్ సీన్... హీరో ఇంట్రడక్షన్ (Ravi Teja Introduction Fight) గురించి చెబుతున్నారు. ట్రైన్ సీక్వెన్స్ సూపర్ ఉందని... మాస్ మహారాజా అభిమానులకు గూస్ బంప్స్ గ్యారెంటీ అంటున్నారు. అన్నిటి కంటే ముఖ్యంగా డార్క్ క్యారెక్టర్లో రవితేజ యాక్షన్ హైలైట్ అని ఓవర్సీస్ రిపోర్ట్.


Also Read : 'లియో' రివ్యూ : LCUలో విజయ్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ మేజిక్ వర్కవుట్ అవుతుందా? లేదా?



ప్రేమకథ, సెకండ్ హాఫ్ మైనస్ అవుతుందా?
'టైగర్ నాగేశ్వర రావు'కు రవితేజ ప్లస్ అని ఎన్నారై ఆడియన్స్ చెబుతున్నారు. అదే సమయంలో ఫస్టాఫ్‌లో వచ్చే లవ్ ట్రాక్ మైనస్ అని అంటున్నారు. మరి, ఆ కథలు ఎలా ఉంటాయో చూడాలి. 


'టైగర్ నాగేశ్వర రావు' సెకండ్ హాఫ్ కూడా సాగదీసినట్టు ఉందని కొందరు చెప్పే మాట. ఇంకా పాటలు బాలేదట. అవి పక్కన పెడితే... సినిమాలో ప్రొడక్షన్ వేల్యూస్ సూపర్ అంటున్నారు. రవితేజ నటనకు తోడు ఫైట్స్ అన్నీ సూపర్ ఉండటంతో హ్యాపీగా సినిమా చూడవచ్చని చెబుతున్నారు. సినిమా గురించి ట్విట్టర్ టాక్ ఎలా ఉందో ఈ పోస్టుల్లో చూడండి. 


Also Read : భగవంత్ కేసరి రివ్యూ: బాలకృష్ణ నయా అవతార్ ఎలా ఉంది? అనిల్ రావిపూడి మళ్లీ హిట్టు కొట్టాడా?










































లక్ష్మీ మంచు 'దొంగాట', రాజ్ తరుణ్ 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' సినిమాల తర్వాత వంశీ కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రమిది. 'టైగర్ నాగేశ్వర రావు' సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. 'ది కశ్మీర్ ఫైల్స్' నిర్మాత ఆయనే. అంతే కాదు... రవితేజ హిట్ సినిమా 'ధమాకా' నిర్మాణంలో కూడా ఆయన భాగస్వామి. 


'టైగర్ నాగేశ్వర రావు' సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్ ఓ కథానాయికగా నటించారు. మహేష్ బాబు 'వన్ నేనొక్కడినే', అక్కినేని నాగ చైతన్య 'దోచెయ్', ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాల్లో నటించిన కృతి సనన్ చెల్లెలు ఆమె. గాయత్రి భరద్వాజ్ మరో కథానాయిక. ఇంకా జయవాణి పాత్రలో తమిళ బ్యూటీ అనుకీర్తి వ్యాస్ నటించారు. హేమలతా లవణం పాత్రలో రేణూ దేశాయ్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, బెంగాలీ నటుడు జిష్షు సేన్ గుప్తా, నాజర్, హరీష్ పేరడీ, సుదేవ్ నాయర్, 'ఆడుకాలం' నరేన్, ప్రదీప్ రావత్ ఇతర ప్రధాన తారాగణం.    


'టైగర్ నాగేశ్వర రావు' చిత్రానికి ఏఆర్ రెహమాన్ మేనల్లుడు, యువ సంచలనం జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : ఆర్. మది, ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్లా, సంభాషణల రచయిత : శ్రీకాంత్ విస్సా, సహ నిర్మాత: మయాంక్ సింఘానియా.