Prabhas Spirit Update: స్పిరిట్‌ మూవీ అప్‌డేట్‌ - ప్రభాస్‌ కోసం తెరపైకి ముగ్గురు హీరోయిన్ల పేర్లు? సందీప్‌ ఫోకస్‌ ఆమెపైనేనట!

Prabhas: 'స్పిరిట్‌'లో ప్రభాస్‌ కోసం హీరోయిన్‌ వేటలో పడ్డాడట సందీప్‌ రెడ్డి వంగా. ఈ క్రమంలో ముగ్గురు పేర్లు ఆయన పరిశీలిస్తున్నారు. వారిలో ఒక్కరి ఫైనల్ చేసి ప్రభాస్‌ జోడిగా ఫిక్స్‌ చేయబోతున్నట్టు టాక్‌.

Continues below advertisement

Prabhas and Sandeep Reddy Vanga Spirit Heroine: ప్రభాస్‌ 'కల్కి 2898 AD' మూవీ రిలీజ్‌కి రెడీ అవుతుంది.ఈ సమ్మర్‌ కానుకగా మూవీ థియేటర్లోకి రాబోతుంది. దీంతో అంతా ఇప్పుడు ప్రభాస్‌ తదుపరి చిత్రం స్పిరిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం 'యానిమల్‌' మూవీ బిగ్ బ్లాక్‌బాస్టర్‌ అవ్వడంతో ఈ సక్సెస్‌ జోష్‌లో ఉన్నాడు సందీప్‌ రెడ్డి వంగా. ఇక ఈ సినిమా పాన్‌ వరల్డ్‌ మూవీ అని ప్రకటనతోనే తెల్చేశారు. దీంతో మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇది ప్రభాస్‌ 25వ చిత్రం కావడంతో ఓ రేంజ్‌లో స్పిరిట్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగిపోయాయి.

Continues below advertisement

పైగా యానిమల్‌ మూవీ సక్సెస్‌ అవ్వడం, ప్రభాస్‌ సిల్వర్‌ జూబ్లీ మూవీ కావడంతో సందీప్‌ రెడ్డి వంగా స్పిరిట్‌ ఓ చాలెంజింగ్‌ మూవీ అయ్యింది. అందుకే ఫ్యాన్స్‌ని ఏమాత్రం డిసప్పాయింట్‌ చేయకుండ ప్రభాస్‌ పాత్రపై స్పెషల ఫోకస్‌ పెట్టాడట. ప్రభాస్‌ బాడీ లాంగ్వెజ్‌కి తగ్గట్టుగా తనదైన మార్క్‌ చూపించే విధంగా స్క్రిప్ట్‌ను మలుస్తున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌తో పాటు ప్రి ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌ అంతా పూర్తి అయ్యి సెట్‌పైకి వచ్చేందుకు ఈ ఇయర్‌ ఎండ్‌ పడుతుందట. ఇటీవల ఓ ఇంటర్య్వూలోనూ ఇదే విషయం చెప్పాడు సందీప్‌. దీంతో అప్పటి నుంచి స్పిరిట్‌కి ఏదోక వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.

సందీప్ ని ఇంప్రెస్ చేసిన 'నేషనల్ క్రష్'!

Who Is Prabhas Heroine in Sanddep Reddy Vanga Spirit: అయితే ఈ సినిమా కోసం ప్రభాస్‌ కోసం హీరోయిన్‌ని ఎవరిని తీసుకోవాలా? అని సందీప్‌ డైలామాలో ఉన్నాడట. ప్రభాస్‌ రేంజ్‌, కటౌట్‌కు సూట్‌ అయ్యే హీరోయిన్‌ వేటలో ఉన్నాడట. ఇది వరకు ప్రభాస్‌తో నటించని కొత్త భామను తీసుకోవాలనుకుంటున్నాడట. ఈ క్రమంలో 'స్పిరిట్‌' కోసం ముగ్గురు హీరోయిన్లను పేర్లు అనుకుంటున్నాడట. అందులో నేషనల్‌ క్రష్‌ రష్మిక, కీర్తి సురేష్‌, మృణాల్ ఠాకూర్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయట. వీరిలో ప్రభాస్‌కు సూట్‌ అయ్యే భామ ఎవరనేది తన టీంతో చర్చిస్తున్నాడట. అయితే అంతా రష్మిక పేరు అనుకుంటున్నారట. సందీప్‌ కూడా యానిమల్‌లో గీతాంజలిగా తన పర్ఫామెన్స్‌తో అందరిని ఆకట్టుకుంటుంది.

దీంతో ఆమె వర్క్‌కి ఇంప్రెస్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా 'స్పిరిట్‌'కి కూడా రష్మికనే తీసుకోవాలని అనుకుంటున్నాడట. ఇప్పుడు టాలీవుడ్‌లో మృణాల్ ఠాకూర్ పేరు బాగా వినిస్తుంది. ఆమె అయితే ప్రభాస్‌ పర్ఫెక్ట్‌ జోడీ అని కొందరు సందీప్‌కి సూచించారట. కానీ అల్రెడీ మృణాల్ ప్రభాస్‌తో ఓ సినిమాలో ఫిక్స్‌ అయిపోయిందట. అదే 'సీతారామం' ఫేం హనురాఘవపుడి-ప్రభాస్‌ కాంబినేషన్‌లో రాబోయే అప్‌కమ్మింగ్‌ మూవీకి హీరోయిన్‌గా మృణాల్ ఫైనల్‌ అయినట్టు తెలుస్తోంది. దీంతో సందీప్‌ రెడ్డి వంగా రష్మిక స్పిరిట్‌లో హీరోయిన్‌గా తీసుకోవాలని గట్టిగా అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేవరకు వేయిట్‌ చేయాల్సిందే. 

Also Read: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 

Continues below advertisement