Manchu Manoj On Clashes With Mega Family: ఇటీవల గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. మార్చి 27న చరణ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ రోజు సాయంత్రం శిల్పా కళ వేదికలో ఆయన పుట్టిన రోజు వేడుకను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్‌ సినీ ప్రముఖులంత హాజరయ్యారు. అలాగే మంచు హీరో మనోజ్‌ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మనోజ్‌ మెగా ఫ్యామిలీతో గొడవలపై  హాట్ కామెంట్స్ చేశాడు. అయితే, మెగా-మంచు ఫ్యామిలీ మధ్య ఎప్పటినుంచో కోల్డ్‌ వార్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత మా ఎలక్షన్స్‌లో ఇది స్పష్టంగా కనిపించింది. మా అసోసియేషన్‌ ఎన్నికల్లో విష్ణు, ప్రకాశ్‌ రాజ్‌ పోటీ పడగా మెగా ఫ్యామిలీ మాత్రం ప్రకాశ్‌ రాజ్‌కే సపోర్టు ఇచ్చింది. అప్పుట్లో ఇది హాట్‌టాపిక్‌ అయ్యింది. అలాగే ఎన్నో ఈవెంట్స్‌లో మెగాస్టార్‌ చిరంజీవి, మంచు మోహన్‌ బాబులు పరోక్షంగా ఒకరిపై ఒకరు కౌంటర్‌ వేసుకుంటుంటారు. 


మావి టామ్ అండ్ జెర్రి గొడవలు


ఇక మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఎలాంటి ఈవెంట్‌ అయిన మంచు ఫ్యామిలీ అక్కడ కనిపించదు.. అలాగే మంచు ఫ్యామిలీ ఈవెంట్‌లో మెగా హీరోలు కనిపించరు. కానీ, చరణ్‌-మనోజ్‌లు మాత్రం స్పెషల్‌ డేస్‌లో తమ స్నేహబంధాన్ని చాటుకుంటారు.  ఈ క్రమంలో మొన్న జరిగిన చరణ్‌ బర్త్‌డే వేడకులకు హాజరైన మనోజ్‌ మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ వివాదంపై నోరు విప్పాడు. "మీకు ఒకటి చెప్పాలి నేను ఇక్కడి వస్తుంటే ఒకరు అన్నారు. ఇది ఎలా మీరు మాత్రం మంచి స్నేహితులు. కానీ, మీ నాన్నలు మాత్రం కొట్టుకుంటారు, కలిసిపోతుంటారు. కానీ మీరు మాత్రం మంచి స్నేహితులుగా ఎలా ఉంటున్నారని అడిగారు. అయితే మెగా-మంచు ఫ్యామిలీ గొడవలు అనేవి భార్య-భర్త మధ్య వచ్చే మనస్పర్థలు లాంటివి. వీరి గొడవలు క్యూట్ టామ్‌ అండ్‌ జర్రీ లాంటివి.  వాళ్లు కొట్టుకుంటారు, కలిసిపోతుంటారు. 45 ఏళ్లుగా వారు ఒకే ఇండస్ట్రీలో కలిసి పనిచేస్తున్నారు. వారిద్దరు ఎప్పిటికైన మంచిగా కలిసిపోవాలని కోరుకుంటున్నాను. ఫైనల్‌ మంచు-మెగా ఫ్యామిలీ రిలేషన్‌ ఎలా ఉండాలంటే చేపకు, నీటికి మధ్య ఉండే అనుబంధంలా ఉండాలని ఆశిస్తున్నాను" అంటూ తన స్పీచ్‌ను ముగించాడు. ప్రస్తుతం మనోజ్‌ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.


Also Read: రామ్‌ చరణ్‌ సినిమాలో సుకుమార్‌ హ్యండ్‌! - అతిథి పాత్ర కూడా, నిజమెంత?


ఆ తర్వాత చరణ్ గురించి చెప్పుకొచ్చాడు. రామ్‌ చరణ్‌ బర్త్‌డే వేడుకలకు రావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు. "ఇండస్ట్రీలో చరణ్ నాకు ప్రాణ స్నేహితుడు. చిన్నప్పుడు మేము చెన్నైలో ఉన్నప్పుడు మేం పక్కపక్కనే ఉండేవాళ్లం. ఇక వ్యక్తిగతంగా చరణ్‌ చాలా గొప్ప మనసు ఉన్న వ్యక్తి. ఎవరైన కష్టమంటూ తన దగ్గరి వస్తే తప్పకుండే ఎంతోకొంత సాయం చేస్తాడు. అదే తనలోని గొప్ప గుణం. ఈ కాలంలో చాలా విలువైంది స్నేహం. కానీ, మనిషి ఎదిగే కొద్ది కొత్త కొత్త స్నేహితులను చేసుకుంటారు. కానీ చరణ్‌ అలా కాదు. తన చిన్ననాటి స్నేహితులతో కూడా ఇప్పటికీ టచ్‌లో ఉంటూ గొప్ప గుణాన్ని చాటుకుంటాడు. ఒకసారి నేను అమెరికాలో ఉన్నాను. దుబాయ్‌లో మన తెలుగు అమ్మాయి. చిన్నపిల్ల ఇమిగ్రేషన్‌ సమస్య ఆ పాప, ఫ్యామిలీ అక్కడ ఇరుక్కుపోయారు. ఇది 2018లో జరిగింది. వారికి నా వంతు సాయం చేశాను. కానీ నా దగ్గర అప్పుడు లేవు. దాంతో అర్థరాత్రి చరణ్‌కి ఫోన్‌ ఇది విషమం అని చెప్పాగానే అకౌంట్‌ నెంబర్‌ పెట్టమని క్షణాల్లో రూ. 5 లక్షలు పంపాడు" అంటూ చెప్పుకొచ్చాడు.