Sukumar Influence On Ram Charan RC 16: సుకుమార్‌ శిష్యుడు, 'ఉప్పెన' డైరెక్టర్‌ బుచ్చిబాబు సాన రెండో సినిమాకే ఏకంగా గ్లోబర్‌ స్టార్‌తో జతకట్టాడు. రామ్‌ చరణ్‌తో ‘RC16’ అనే ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ అట్టహాసం పూజ కార్యక్రమాన్ని కూడా జరుపుకుంది. ఇక రెగ్యూలర్‌ షూటింగ్‌ మొదలు కావాల్సి ఉంది. అయితే ఈ మూవీ పూజ కార్యక్రమంలో క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈయనే కాదు అల్లు అరవింద్‌తో పాటు పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు కూడా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. అయితే ఇందులో సుకుమార్‌ సందడి చూసి అంతా ఆరా తీస్తున్నారు.


'పుష్ప 2' సెట్‌లో ఉండాల్సిన సుకుమార్‌ ఈ మూవీ పూజ కార్యక్రమంలో కనిపించడం అందరిని సర్‌ప్రైజ్‌ చేసింది. అయితే, తన శిష్యుడు బుచ్చిబాబు సినిమా కావడంతో ఆయన ఈ పూజ కార్యక్రమానికి హజరయ్యారన్నది బయటకు కనిపిస్తున్న అంశం. కానీ పరోక్షంగా సుకుమార్‌ ఈ మూవీలో భాగమైనట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. తన శిష్యుల మూవీ మేకింగ్‌ విషయంలో స్క్రిప్ట్‌ నుంచి దర్శకత్వం వరకు సుకుమార్‌ సపోర్టుగా ఉంటారనే విషయం తెలిసిందే. ఆయన క్రియేటివిటీని విరూపాక్షలో చూపించాడు. ఈ మూవీ డైరెక్టర్‌ కార్తీక్‌ వర్మ దండుకు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సుకుమార్‌ స్క్రీన్‌ప్లే అందించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. వందకోట్ల క్లబ్‌లో కూడా చేరి మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ కెరీర్‌లో హయ్యేస్ట్‌ గ్రాస్‌ మూవీగా నిలిచింది.


అయితే ఇప్పుడు ఆర్‌సీ 16 విషయంలోనూ సుకుమార్‌ అదే చేస్తున్నాడు. మేకింగ్‌ విషయంలో బుచ్చిబాబుకు ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చాడట కానీ, ఈ సినిమాలో ఆయన నటించబోతున్నారనే ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో గుసగుసల వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నిర్మాతల్లో ఆయన కూడా ఒకరని విషయం తెలిసిందే. మైత్రీ మూవీస్‌తో పాటు సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్లో ఈ చిత్రం నిర్మితం కానుంది. ఇప్పుడు RC16 క‌థలో సుకుమార్ పాత్రతో పాటు బ్యాక్ డ్రాప్‌, హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌, క్లైమాక్స్ త‌దిత‌ర అంశాల్లో సుకుమార్ ఇన్ పుట్స్ ఇచ్చాడట. నిజానికి సుకుమార్‌ సలహాతోనే బుచ్చి ఈ స్క్రిప్ట్‌ అనుకున్నాడట. అయితే మొదట బుచ్చిబాబు ఈ కథ జూనియర్‌ ఎన్టీఆర్‌ కోసం డిజైన్‌ చేశారట.



కానీ, ఇది వర్క్‌ అవుట్‌ కాకపోవడంతో ఇది రామ్‌ చరణ్‌కు ఫైనల్‌ అయ్యింది. ఈ సలహా బుచ్చిబాబుకు సుకుమారే ఇచ్చారట. దీంతో చరణ్‌ ఈ ప్రాజెక్ట్‌కి ఓకే అనడంతో సుకుమార్‌ ఈ స్కిప్ట్‌లో రామ్‌ చరణ్‌కు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేయించారట. చరణ్‌ బాడీ లాంగ్వేజ్‌, ఆయన మునుపటి సినిమాలు దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్‌లో సూచనలు ఇచ్చాడట. దాని ప్ర‌కారం స్క్రీన్ ప్లే, క్యారెక్ట‌రైజేష‌న్ మారిందట. ఇక ఈ కథను ఎన్టీఆర్ నుంచి రామ్‌ చరణ్‌కు మార్చమనే సలహా నుంచి ఈ మూవీలో బ్యాక్ డ్రాప్‌, హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌, క్లైమాక్స్‌ వంటి  త‌దిత‌ర అంశాలు అన్నింటిలో సుకుమార్‌ హస్తం ఉందని సమాచారం. అలాగే ఈ చిత్రంలో ఆయన అతిథి పాత్ర కూడా చేయబోవడం కొసమెరుపు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే RC16 నుంచి ఆఫీషియల్‌ అప్‌డేట్‌ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. 


Also Read: 'మైల్‌ స్టోన్‌ మూమెంట్‌' - దుబాయ్‌లో అల్లు అర్జున్‌ వ్యాక్స్‌ స్టాట్చ్యూ ఆవిష్కరణ, బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌