Tillu Square’s OTT and satellite rights : 'డీజే టిల్లు'తో మ్యాజిక్  క్రియేట్ చేశాడు సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌. కుర్ర‌కారును ఉర్రూత‌లూగించాడు. అందులోని డైలాగులు, సీన్లు, సిద్దు యాక్టింగ్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఆ త‌ర్వాత 'డీజే టిల్లు'కి సీక్వెన్స్ అని ప్ర‌క‌టించిన రోజు నుంచి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఫ్యాన్స్ ఈగ‌ర్ గా వెయిట్ చేశారు. అయితే, ఆ రోజు రానే వ‌చ్చింది. టిల్ల‌న్న మ‌ళ్లోసారి వ‌చ్చేశాడు.'టిల్లు స్క్వేర్' పేరుతో థియేట‌ర్ల‌లో సందడి చేస్తున్నాడు. అనుప‌మ‌ప‌ర‌మేశ్వ‌ర‌న్ తో క‌లిసి ఈ సారి రెట్టింపు ర‌చ్చ చేశాడు అని ఫ్యాన్స్ తెగ సంబ‌రప‌డిపోతున్నారు. ఇక హిట్ టాక్ అందుకున్న ఈ సినిమాకి అప్పుడే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు, శాటిలైట్ ఛానెళ్లు డీల్ కుదిర్చేసుకున్నాయ‌ట‌. మ‌రి ఎక్క‌డ స్ట్రీమ్ అవుతుంది? 'టిల్లు స్క్వేర్'. 


ప్ర‌ముఖ ఓటీటీకి రైట్స్.. 


ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుందంటే.. చాలామంది ఏ ఓటీటీలోకి వ‌స్తుంది? అని ఎదురు చూస్తున్నారు. ఇక అభిమానులు కూడా అంతే.. బిగ్ స్క్రీన్ పైన చూసినా మ‌ళ్లోసారి ఓటీటీలో చూసేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. అందుకే, ఏ ఓటీటీలో రిలీజ్ అయ్యింద‌నే ఆస‌క్తి ఉంటుంది చాలామందిలో. ఇక ‘టిల్లు స్క్వేర్’ని ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. శాటిలైట్ రైట్స్‌ను ‘స్టార్ మా’ టీవీ చానెల్ కొనుగోలు చేసింద‌ట‌. భారీగానే డీల్ కుదిరిన‌ట్లుగా కూడా ఫిలిమ్ న‌గ‌ర్ లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 


పాజిటివ్ రివ్యూలు.. 


'టిల్లు స్క్వేర్' ప్రపంచ వ్యాప్తంగా మార్చి 29న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఇప్పటికే షోలు ప‌డ్డాయి. రివ్యూలు కూడా వ‌చ్చేస్తున్నాయి. నిజానికి ఈ సినిమా పోస్ట‌ర్, టీజ‌ర్, ట్రైల‌ర్ అన్ని మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. సినిమాపై అంచ‌నాలు పెంచేశాయి. ఇక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్.. ఈ సినిమాలో కొంచెం డోస్ పెంచ‌డంతో ఈగ‌ర్ గా వెయిట్ చేశారు అంద‌రూ సినిమా కోసం. ఇక ఇప్పుడు అదే పాజిటివ్ టాక్ రిపీట్ అవుతోంది. రివ్యూలు పాజిటివ్ గానే వినిపిస్తున్నాయి. టిల్ల‌న్న ఈసారి డీజే ఇంకా గ‌ట్టిగా కొట్టాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజ‌న్లు. మేజిక్ రిపీట్ అయ్యింద‌ని, థియేట‌ర్ల‌లో న‌వ్విస్తాడు అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ అయితే హాట్ గా ఉంద‌ని, సెగ‌లు పుట్టించింది అంటూ కామెంట్లు పెడుతున్నారు కుర్ర‌కారు. సూప‌ర్ డూప‌ర్ హిట్ అంటున్నారు. 


2022లో 'డీజే టిల్లు పేరుతో థియేట‌ర్ల‌లో సంద‌డి చేశాడు సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ‌. ఫ‌స్ట్ పార్ట్ లో నేహా శెట్టి హీరోయిన్ గా చేశారు. టిల్లు స్క్వేర్ లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక కాగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై తెరకెక్కింది. సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మాతలు. రామ్ మిరియాల, అచ్చు రాజమణి స్వరకర్తలు.


Also Read: నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ - ఓటు వేయడం కుదరకపోతే చచ్చిపోండి, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చుతారు?