Sundaram Master movie Streaming Details: వైవా హర్ష లీడ్ రోల్లో తెరకెక్కిన సుందరం మాస్టర్ మూవీ గతనెల థియేటర్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కామెడీ ఎంటర్‌టైనర్ వచ్చిన ఈ మూవీ రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు ఉండేవి. అయితే విడుదలై తర్వాత ఈ సినిమా ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో అంచనాలతో థియేటర్లోకి వెళ్లిన ఆడియన్స్‌ని ఈ మూవీ పెద్దగా మెప్పించలేకపోయింది. ఫలితం ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఫస్ట్ డే వీక్ మాత్రం ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ కావడంతో మూవీపై బజ్ క్రియేట్ అయ్యింది.
అలా ఎన్నో అంచనాలతో ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదల అయ్యిన ఈ చిత్రం దీంతో ఫస్ట్ వీక్‌లో డీసెంట్ వసూళ్లు చేసింది. ఇదిలా అయితే ఇప్పుడీ ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చేసింది. థియేటర్లో విడుదలైన నెల రోజులకు ఈ సినిమా డిజిటల్ వేదికకు వచ్చేసింది. ఇటీవల ఈ సినిమాను మార్చి 28న ఓటీటీ రిలీజ్ చేస్తున్న ఆహా నుంచి ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ సంగతి తెలిసిందే. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ని తగ్గించుకుంది. నేడు ఈ మూవీ స్ట్రీమింగ్ తీసుకువచ్చింది. అర్థరాత్రి నుంచి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి థియేటర్లో మిస్ అయినవారు.. ఆహాలో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.
కాగా 'కలర్ ఫోటో' 'మంత్ ఆఫ్ మధు' వంటి పలు చిత్రాల్లో హర్ష హీరోలకు స్నేహితుడిగా, కీలక పాత్రల్లో నవ్వించారు. అవకాశం వచ్చినప్పుడు, భావోద్వేగభరిత పాత్రల్లో సైతం మెప్పించి ప్రేక్షకులచేత కూడా కంటతడి పెట్టించాడు. ఇప్పటి వరకు సహాయ పాత్రల్లో నటించిన హార్ష తొలిసా సుందరం మాస్టర్‌తో లీడ్ రోల్లో నటించాడు. ఈ సినిమాను ఆర్‌టీటీ వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు సంయుక్తంగా నిర్మించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. 'కెజిఎఫ్'లో ఇనాయత్ ఖలీల్ రోల్ చేసిన బాలకృష్ణ, హర్షవర్ధన్, భద్రం తదితరులు ఇతర పాత్రలు చేశారు.
కథేంటంటే..
మిరియాల మిట్ట అనే ఓ మూరుమూల గూడెం.. అదీ పాడేరుకు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేకుండా ఉన్నారు. వాళ్ళందరూ ఓ కుటుంబంలా కలిసి మెలిసి జీవిస్తుంటారు. వాళ్ళు తమ ఊరికి మరొకరిని రానివ్వరు. అటువంటిది ఓ రోజు ఆ జనాలు తమకు ఒక ఇంగ్లీష్ టీచర్ కావాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. అది చూసి సుందర్ రావు (హర్ష చెముడు)ను పంపిస్తుంది ప్రభుత్వం. సుందర్ రావు (వైవా హర్ష)ను మిరియాల మిట్ట పంపించే ముందు ఎమ్మెల్యే (హర్ష వర్ధన్) తనకు ఒక పని చేసి పెట్టమని అడుగుతాడు. ఆ ఊరిలో విలువైనది ఒకటి ఉందని, అదేమిటో తెలుసుకుని చెప్పమని అడుగుతాడు. మూడు రోజుల్లో పని పూర్తి చేసుకుని మళ్లీ విశాఖ వస్తానని చెబుతాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో మిరియాల మిట్ట వెళ్లిన సుందర్ రావుకు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అతడికి ఇంగ్లీష్ రాదని తెలుసుకున్న అక్కడి ప్రజలు ఏం చేశారు? చివరికి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.