Family Star Trailer Out: క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ, మరాఠి బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'ఫ్యామిలీ స్టార్‌'. 'గీత గోవిందం'వంటి సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్ ఇచ్చిన పరశురామ్ పెట్ల దర్శకత్వంలోవిజయ్ దేవరకొండ  రెండోసారి చేస్తున్న చిత్రమిది. దీంతో 'ఫ్యామిలీ స్టార్‌'పై భారీ అంచాలు నెలకొన్నాయి. మరోవైపు ఈ మూవీ నుంచి వస్తున్న అప్‌డేట్స్‌, ప్రచార పోస్టర్స్‌ మూవీపై హైప్‌ క్రియేట్‌ చేశాయి. ఇక రీసెంట్‌గా వచ్చిన ట్రైలర, సెకండ్‌ సాంగ్‌కు అయితే భారీ రెస్పాన్స్‌ వచ్చింది. ఏప్రీల్‌ 5న ఈ మూవీ రిలీజ్‌ కానున్న నేపథ్యంలో మేకర్స్‌ ప్రమోషన్స్‌ షూరు చేశారు. ఇందులో భాగంగా నేడు ఫ్యామిలీ స్టార్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. తాజాగా విడులైన ఈ ట్రైలర్‌ మూవీపై మరింత ఆసక్తి పెంచుతుంది. 


ట్రైలర్ ఎలా ఉందంటే.. 


ట్రైలర్‌ ఎలా ఉందంటే.. ఈ ట్రైలర్‌లో ప్రారంభంలోనే విజయ్‌ దేవరకొండ దేవుడికి దండం పెట్టుకుంటూ కనిపించాడు. స్వామి నాకు కొత్తగా లైఫ్‌లో బ్రేక్‌లు ఏం ఇవ్వాల్సిన పని లేదు. కానీ, ఉన్నదాన్ని మాత్రం చెడగొట్టకు" అనే డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. మిడిల్‌ క్లాస్‌కు చెందిన హీరో తన ఫ్యామిలీ బాధ్యత మొత్తం తన మీదే ఉంటుంది. ఈ క్రమంలో ఆ ఫ్యామిలీ ధనవంతురాలై అమ్మాయి (మృణాల్ ఠాకూర్) పరిచయంతో వారిలో వచ్చే మార్పుల వల్ల హీరో ఇబ్బంది పడ్డట్టు ట్రైలర్‌లో చూపించాడు. దాంతో ఆ అమ్మాయితో పరిచయం మానుకోవాలని, ఆమె మన ఇంటికి రావద్దంటూ ఫ్యామిలీ దగ్గర ఒట్టు తీసుకునే సీన్‌ ఆసక్తిగా ఉంటుది. ఆ తర్వాత హీరోయిన్‌.. "ఓ మై గాడ్‌ నేను మీకు ఫుల్‌గా పడిపోయానండి!" వంటి డైలాగ్‌తో పాటు విజయ్‌ చేత "నా గురించి మీకు తెలియదండి.. తప్పు నాదైనప్పుడు నలుగురి మధ్యలో కాళ్లు పట్టేసుకున్న రోజులు కూడా ఉన్నాయి" అని విజయ్‌ చేత చెప్పించిన డైలాగ్స్‌ ట్రైలర్‌కి హైలెట్‌ అని చెప్పాలి.  హీరో, హీరోయిన్‌కు పడిపోవడం, ఆమె కోసం ఫారెన్‌ వెళ్లడం వంటి సీన్స్‌ ఆసక్తిగా ఉన్నాయి. 



ఇక ప్రేమలో పడ్డాక ఈ హీరోకు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి, అసలు హీరో ఫారెన్‌ ఎందుకు వెళ్లాడు.. వంటి సీన్స్‌ మూవీపై అంచనాలు పెంచుతున్నాయి. మధ్య జగపతి బాబును చూపించారు. "ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ నష్టపోయేది నువ్వే" అని విజయ్‌తో జగపతి బాబు చెప్పిన డైలాగ్‌ అంచనాలు పెంచేస్తుంది. ఆ తర్వాత మృణాల్, విజయ్‌తో.. "నాకు ఏమైన ఫైనాన్షియల్‌ ప్రాబ్లమ్‌ ఉంటుందా? లేక కెరియర్‌ ప్రాబ్లమ్‌ ఉంటుందా? నేను నీ లైఫ్‌లోకి రావడమే పెద్ద ప్రాబ్లమ్‌" అని అనడం, ట్రైలర్‌ చివరిలో "కోపం తీరిపోతుందంటే నన్ను కొట్టవే బాబు" హీరో, హీరోయిన్‌తో చెప్పడం వంటి సీన్స్‌ మూవీపై క్యూరియసిటీని పెంచుతున్నాయి. మొత్తానికి ట్రైలర్‌తో సినిమాపై మరింత బజ్‌ క్రియేట్‌ చేశారు మేకర్స్‌. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్‌ ట్రైలర్‌ యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. 


Also Read: మంచులో సితారతో గౌతమ్‌ ఆటలు - ఆ స్టైల్‌ చూశారా, అచ్చం తండ్రిలాగే!


"ఫ్యామిలీ స్టార్" సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్‌ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా విడుదల కానుంది. అయితే మొదట ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, అదే టైంలో నాలుగైదు పెద్ద సినిమాలు ఉండటంతో వాయిదా వేశారు. ఆ తర్వాత రవితేజ ఈగల్‌, ఊరుపేరు భైరవకోన వంటి సినిమాలు కూడా ఉండటంతో ఫైనల్‌గా ఈ చిత్రం ఏప్రిల్‌ 5కి రిలీజ్‌ డేట్‌ను లాక్‌ చేసుకుంది.