Siddhu Jonnalagadda About trolls On Anupama: రింగుల జుట్టు ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్, యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'టిల్లు స్క్వేర్'. 2002లో విడుదలై అద్భుత విజయాన్ని అందుకున్న 'డీజే టిల్లు' సినిమాకు సీక్వెల్‍ ఈ సినిమా తెరకెక్కింది.  మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ రూపొందింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా మార్చి 29న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అట్టహాసంగా నిర్వహించారు.


ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరుకాని అనుపమ  


'టిల్లు స్క్వేర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సిద్దు సహా చిత్రబృందం అంతా పాల్గొన్నా, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాత్రం కనిపించలేదు. దాని వెనుక ఓ కారణం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా `టిల్లు స్వ్కైర్‌` సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్‌ విడుదలైంది. ఇందులో హీరోహీరోయిన్‌ సిద్దుజొన్నలగడ్డ, హీరోయిన్‌ అనుపమా పరమేశ్వరన్‌ లిప్‌ కిస్‌ పెట్టుకున్నారు. దీంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దారుణంగా ట్రోల్‌ చేశారు. కొంత మంది హద్దుల దాటి విమర్శలు చేయడం పట్ల ఆమె బాగా హర్ట్ అయ్యిందట. అందుకే ఈ వేడుకకు తను హాజరు కాలేదట.ఈ విషయాన్ని సిద్దు స్వయంగా వెల్లడించారు.


కామెంట్స్ ఎంజాయ్ చేసేలా ఉండాలి, ఇబ్బంది పెట్టొద్దు- సిద్దు


 “'టిల్లు స్క్వేర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి అనుపమ రాకపోవడానికి ఓ కారణం ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్‌ అయ్యింది. అందులో ఒక హ్యాండ్‌ పొజీషన్‌ చూసి చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. హీరో హీరోయిన్లకి సంబంధించి చాలా వరకు ఫోకస్‌ ఉంటుంది. పది మంది పది రకాలుగా మాట్లాడతారు. దాని గురించి నేను పెద్దగా మాట్లాడను. కానీ ఫీమేల్‌ కోస్టార్‌, ఫీమేల్‌ యాక్టర్స్ గురించి కామెంట్‌ చేసేటప్పుడు కాస్త హుందాగా వ్యవహరిస్తే బాగుంటుంది. ఒక అమ్మాయిని కామెంట్ చేస్తే అది జాలీగా ఉండాలి. ఎంజాయ్ కలిగించేలా ఉండాలి. కానీ, ఇబ్బంది పెట్టకూడదు. సెన్సిటివ్ మ్యాటర్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొంత మంది ఏం పనీ పాటా లేకుండా ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నవాళ్లు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి మందికాదు” అని సిద్దు చెప్పుకొచ్చారు.   


'టిల్లు స్క్వేర్' సినిమాకి సిద్ధు జొన్నలగడ్డ స్క్రీన్ ప్లే  డైలాగ్స్ అందించగా.. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ నిర్వహించారు. రామ్ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం సమకూర్చగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 29న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.   


Read Also: కాంట్రవర్షియల్ క్రిటిక్ మెచ్చిన క్రూ - ముగ్గురు హీరోయిన్స్ సినిమాకు 3 ప్లస్ రేటింగా!?