Crew movie first review in Telugu: బాలీవుడ్ తెరకెక్కించిన మరో ఫిమేల్ సెంట్రిక్ సినిమా 'క్రూ'. టబు, కరీనా కపూర్ ఖాన్, కృతి సనన్... ముగ్గురు హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 29... అంటే ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి వస్తుందనగా... దుబాయ్ నుంచి పాజిటివ్ రివ్యూ వచ్చింది. కాంట్రవర్షియల్ క్రిటిక్ ఉమైర్ సందుకు 'క్రూ' విపరీతంగా నచ్చింది. ఆయన ఈ సినిమాకు ఇచ్చిన రివ్యూ ఎలా ఉందో చూడండి. 


బిందాస్ గాళ్ గ్యాంగ్... కరీనా కపూర్ ఈజ్ బ్యాక్!
Crew Movie Review In Telugu: థియేటర్లలో సర్‌ప్రైజ్ అయ్యేందుకు ప్రేక్షకుల్ని రెడీ అవ్వమని ఉమైర్ సందు చెబుతున్నాడు. 'క్రూ' సినిమాలో హ్యూమర్ బాగా వర్కవుట్ అయ్యిందని, సంభాషణలు / వన్ లైన్ పంచ్ డైలాగులు నవ్విచడంతో పాటు షాక్ ఇస్తాయని చెప్పుకొచ్చాడు. గాళ్ గ్యాంగ్ నిజంగా బిందాస్ అని పేర్కొన్నాడు. కరీనా కపూర్ ఖాన్ ఈజ్ బ్యాక్ అని చెప్పాడు. సినిమా ప్రొడ్యూస్ చేసిన అనిల్ కపూర్, ఏక్తా కపూర్, శోభా కపూర్లకు థ్యాంక్స్ చెప్పాడు.


Also Read: టిల్లు స్క్వేర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - ఇది 'మ్యాడ్'కు తాత, పక్కా బ్లాక్ బస్టరే!






ఉమైర్ సందు రివ్యూలు కాంట్రవర్షియల్ అయిన సందర్భాలు కోకొల్లలు. రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్'కు అతడు 4 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. అదే ఉమైర్ సందు 'బాహుబలి' బాలేదన్నాడు. రీసెంట్ 'హను-మాన్'కు సైతం నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. అతడు ఫేక్ రివ్యూ రైటర్ అని ఇండస్ట్రీ చెబుతోంది. మ్యాగ్జిమమ్ సినిమాలు ఫ్లాప్ అనే అతడు, 'క్రూ' సినిమాకు 3 ప్లస్ రేటింగ్ ఇవ్వడం గమనార్హం.


Also Readపృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - సినిమా ఎలా ఉందంటే?



టీజర్, ట్రైలర్, సాంగ్స్... 'క్రూ' సినిమా యూనిట్ విడుదల చేసిన ప్రమోషనల్ మెటీరియల్ సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. దాంతో ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. 'క్రూ' సినిమాలో టబు, కరీనా, కృతి ఎయిర్ హోస్టెస్ రోల్స్ చేశారు. వాళ్ళ ముగ్గురికీ బోల్డంత బంగారం దొరుకుతుంది. జీతాలు టైంకి రాక, కష్టాల్లో ఉన్న వాళ్ళు ఆ బంగారం తీసుకుంటారు. గోల్డ్ కోసం కస్టమ్స్ వాళ్ళు ఎంక్వయిరీ చేయగా తెలిసింది ఏంటి? చివరకు ఏమైంది? అనేది సినిమా.


Also Readతండ్రినే మించిన తనయుడిగా ఎదిగిన రామ్ చరణ్ - ఆయన పడిన కష్టం ఎంత? అసలు అది ఎలా సాధ్యమైంది?