The Goat Life Aadujeevitham special premiere show response in Hyderabad: తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన మలయాళ కథానాయకుడు, 'సలార్' సినిమాలో వరదరాజ మన్నార్ పాత్రతో పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన నటించిన తాజా సినిమా 'ది గోట్ లైఫ్' (ఆడు జీవితం). ఈ గురువారం (మార్చి 28న) థియేటర్లలో విడుదల కానుంది. అయితే... టాలీవుడ్ డైరెక్టర్లకు ఆదివారం రాత్రి హైదరాబాద్ ఏఎంబీ సినిమాస్‌లో ప్రత్యేకంగా షో వేశారు. మరి, వాళ్ళు సినిమాకు ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసుకోండి.


సినిమాకు జాతీయ అవార్డు రావాలి - శివ నిర్వాణ
'ది గోట్ లైఫ్' (ఆడు జీవితం) ద బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ అని 'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి తెలిపారు. సినిమా తనకు బాగా నచ్చిందని చెప్పారు. 'నిన్ను కోరి', 'మజిలీ', 'ఖుషి' చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ అయితే ''జాతీయ అవార్డు సాధించడానికి పూర్తి అర్హత గల చిత్రమిది. చాలా బాగా తీశారు'' అని చెప్పారు. కమర్షియల్ సక్సెస్ సాధించడంతో పాటు అన్ని అవార్డులు సాధించే సినిమా 'ది గోట్ లైఫ్' అని మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్ ధీమా వ్యక్తం చేశారు.


పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ కి హ్యాట్సాఫ్, చాలా గొప్పగా సినిమా తీశారని ప్రముఖ దర్శకులు శ్రీను వైట్ల ప్రశంసలు కురిపించారు. పదేళ్లు ఇటువంటి పాత్రతో ప్రయాణం చేస్తూ సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదని 'సీతా రామం' దర్శకుడు హను రాఘవపూడి అన్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)కి హ్యాట్సాఫ్ చెప్పారు. 


జీవితంలో ఒక్కసారే ఇటువంటి అవకాశం వస్తుంది - ప్రవీణ్ సత్తారు
ఏ నటుడికి అయినా జీవితంలో ఒక్కసారే ఇటువంటి క్యారెక్టర్ చేసే అవకాశం వస్తుందని దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెలిపారు. పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా అద్భుతంగా నటించారని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' దర్శకుడు మహేష్, 'నేను శైలజ' & 'చిత్రలహరి' దర్శకుడు కిశోర్ తిరుమల, చంద్ర సిద్ధార్థ, 'శ్యామ్ సింగ రాయ్' దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సహా పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ 'ది గోట్ లైఫ్' ప్రీమియర్ షోకి హాజరు అయ్యారు.


Also Readపసుపు బదులు ముల్తానీ మట్టి - పెళ్లికి ముందు వేడుక వెరైటీగా ప్లాన్ చేసిన పవన్ కళ్యాణ్, రామ్ సినిమాల్లో హీరోయిన్






జీవనోపాధి కోసం కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి 90వ దశకంలో గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు. ఆ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ బెన్యామిన్ 'గోట్ డేస్' పేరుతో పుస్తకం రాశారు. కేరళలో 2008లో పబ్లిష్ అయ్యింది. విశేష పాఠకాదరణ పొందింది. మలయాళంలో పలువురు దర్శకులు, హీరోలు, నిర్మాతలు ఆ బుక్ రైట్స్ కోసం ప్రయత్నించారు. చివరకు, దర్శకుడు బ్లెస్సీ ఆ హక్కులు సాధించారు. అందులో నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. అమలా పాల్ హీరోయిన్. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ సినిమాను విడుదల చేస్తున్నారు.


Also Read: మధురము కదా... విజయ్ దేవరకొండ, మృణాల్ జోడీ & శ్రేయా ఘోషల్ వాయిస్ - సాంగ్ ఎలా ఉందో విన్నారా?