Om Bheem Bush box office collection worldwide: బాక్సాఫీస్ బరిలో బ్యాంగ్ బ్రోస్ రచ్చ రచ్చ చేస్తున్నారు. రోజు రోజుకూ 'ఓం భీమ్ బుష్' థియేటర్లకు ఎక్కువ మంది ప్రేక్షకుల్ని రప్పిస్తూ... భారీ వసూళ్లు సాధించే దిశగా దూసుకు వెళుతున్నారు. ఫస్ట్ వీకెండ్ ఈ సినిమా కలెక్షన్స్ బావున్నాయి. మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది? ఈ సినిమా ఇప్పటి వరకు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? వంటి విషయాల్లోకి వెళితే... 


మూడో రోజు ఆరున్నర కోట్లకు ఎక్కువ!
Om Bheem Bush Collection Till Now: ఇప్పటి వరకు 'ఓం భీమ్ బుష్' 17 ప్లస్ కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. శ్రీ విష్ణు, ప్రియదర్శి పులికొండ, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ప్రీమియర్ షో నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది. విమర్శకులతో పాటు తెలుగు ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ రెస్సాన్స్ అందుకుంది. బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా ఆ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ కనబడుతోంది. 


మూడు రోజుల్లో ఈ సినిమా 17 ప్లస్ కోట్లు కలెక్ట్ చేసింది. మొదటి రోజు 'ఓం భీమ్ బుష్'కు రూ. 4.60 కోట్లు వచ్చాయి. ఓపెనింగ్ డే కలెక్షన్స్ కంటే సెకండ్ డే కాస్త ఎక్కువ వచ్చాయి. శనివారం ఈ సినిమా కలెక్షన్స్ రూ. 5.84 కోట్లు. సండే అయితే ఆదరగొట్టింది. ఆరున్నర కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది. సోమవారం నుంచి ఏ సినిమాకు అయినా సరే కలెక్షన్లు కాస్త తగ్గుతాయి. అయితే... 'ఓం భీమ్ బుష్' విషయంలో మేజర్ డ్రాప్ కనిపించే అవకాశాలు తక్కువ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


Also Read'సాహో' హీరోయిన్ దొరికేసిందా? లేదంటే కావాలని అలా చేసిందా?






అమెరికాలో 315k డాలర్స్ ప్లస్ కలెక్షన్లు!
ఇండియాతో పాటు ఓవర్సీస్ ప్రేక్షకుల్లోనూ 'ఓం భీమ్ బుష్'కు రెస్పాన్స్ చాలా బావుంది. వినోదాత్మక సినిమాలకు ఎన్నారై ఆడియన్స్ నుంచి ఎప్పుడూ రెస్పాన్స్ బావుంటుంది. వినోదంతో పాటు చక్కటి పాటలు, మ్యూజిక్ యాడ్ కావడంతో 'ఓం భీమ్ బుష్' అమెరికాలోనూ చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వచ్చాయి. అక్కడ 315కె డాలర్స్ కలెక్ట్ చేసింది.


Also Readపసుపు బదులు ముల్తానీ మట్టి - పెళ్లికి ముందు వేడుక వెరైటీగా ప్లాన్ చేసిన పవన్ కళ్యాణ్, రామ్ సినిమాల్లో హీరోయిన్



'హుషారు', 'రౌడీ బాయ్స్' తర్వాత శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన సినిమా 'ఓం భీమ్ బుష్'. ఇందులో శ్రీ విష్ణు సరసన యంగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్ నటించారు. ప్రియదర్శి జోడీగా బాలీవుడ్ బిగ్ బాస్ ఫేమ్ ఆయేషా ఖాన్ సందడి చేశారు. 'పొలిమేర' ఫేమ్ కామాక్షీ భాస్కర్ల అతిథి పాత్రలో సందడి చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్, రచ్చ రవి కీలక పాత్రల్లో నవ్వించారు. ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.


Also Readఆ పెళ్లికి నన్ను ఎందుకు పిలవలేదు? - రామ్ చరణ్ ప్రశ్నకు ఆనంద్‌ మహీంద్రా ఇంట్రెస్టింగ్ రిప్లై