Ram Charan - Anand Mahindra: ఆ పెళ్లికి నన్నెందుకు పిలవలేదు? - చెర్రీ ప్రశ్నకు ఆనంద్‌ మహీంద్రా ఇంట్రెస్టింగ్ రిప్లై

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మహీంద్ర సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా మధ్య ట్విట్టర్ వేదికగా సరదా సంభాషణ జరిగింది. పెళ్లికి ఎందుకు పిలవలేదని చెర్రీ అడిగితే, ఆనంద్ బర్త్ డే శుభకాంక్షలు చెప్పారు.

Continues below advertisement

Ram Charan- Anand Mahindra Conversation: మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఆయన తన వర్క్ లో ఎంత బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేస్తుంటారు. ప్రపంచ నలుమూలల ఏ కొత్త విషయం జరిగినా తన ఫాలోవర్లతో పంచుకుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మధ్య ఓ ఆసక్తికర సంభాషణ జరిగింది. జహీరాబాద్ లో జరిగిన సుజీత్ పెళ్లికి తనను ఎందుకు పిలవలేదని ఆనంద్ మహీంద్రాను రామ్ చరణ్ అడుగుతారు. బిజీలో గందరగోళంలో పడి మర్చిపోయానంటూ ఆనంద్ రిప్లై ఇస్తారు. ఇంతకీ సుజీత్ ఎవరు? ఆ పెళ్లికి  ఆనంద్ మహీంద్రాకు సంబంధం ఏంటి? అనే అనుమానం మీకూ కలుగుతుంది కదా.. ఇంతకీ అసలు విషయం ఏంటంట?

Continues below advertisement

మహీంద్రా కంపెనీ కృషితో సుజీత్ పెళ్లి

రీసెంట్ మహీంద్రా కంపెనీ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో తమ కంపెనీ కృషి వల్ల తెలంగాణలోని జహీరాబాద్ లో గ్రౌండ్ వాటర్ లెవల్ ఎలా పెరిగిందో చూపించారు. కొంతకాలం క్రితం జహీరాబాద్ లో తాగడానికి నీళ్లు కూడా దొరికేవి కాదు. బిందెడు నీళ్ల కోసం మహిళలు కీలో మీటర్ల మేర నడవాల్సి వచ్చేది. ఈ ఊరికి పిల్లను ఇవ్వడానికి కూడా జనాలు భయపడే వారు. తమ బిడ్డ అక్కడికి వెళ్తే నీళ్ల కోసం అవస్థలు పడాల్సి వస్తుందనుకునే వాళ్లు. ఆ సమయంలో జహీరాబాద్‌లో మహీంద్రా ప్యాక్టరీ నిర్మించారు. కంపెనీ తరఫున, ఆ ప్రాంతంలో లక్షలాది మొక్కలను నాటించారు. రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ పిట్స్‌ ఏర్పాటు చేశారు. మహీంద్రా కంపెనీ ప్రయత్నంతో జహీరాబాద్ లో గ్రౌండ్‌ వాటర్‌ లెవల్‌ 400 అడుగులు పెరిగింది. నీటి కరువు కారణంగా పెళ్లి కాకుండా ఉన్న సుజీత్ కు ఇప్పుడు పెళ్లి కాబోతోందని మహీంద్రా కంపెనీ వీడియోలో వెల్లడించారు.  

పెళ్లికి ఎందుకు పిలవలేదన్న రామ్ చరణ్- హ్యాపీ బర్త్ డే చెప్పిన మహీంద్రా

ఈ వీడియోను నటుడు రామ్ చరణ్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. తనను పెళ్లికి ఎందుకు పిలవలేదంటూ ఆనంద్ మహీంద్రాను ప్రశ్నించారు. “ఆనంద్ మహీంద్రా.. సుజీత్ పెళ్లికి నన్నెందుకు ఇన్వైట్ చేయలేదు? జహీరాబాద్ దగ్గరే నేనూ ఉంటాను. పెళ్లికి పిలిస్తే అక్కడ నా ఫ్రెండ్స్ తో సరదాగా గడిపేవాడిని కదా.. ఏది ఏమైనా ఇది చాలా గ్రేట్ వర్క్” అని రాసుకొచ్చారు. రామ్ చరణ్ ట్వీట్ కు ఆనంద్ మహీంద్రా స్పందించారు. “నిజమే! నేను ఆ సమయంలో వర్క్ బిజీతో గందరగోళంలో ఉన్నాను. నిన్ను ఇన్వైట్ చేయలేకపోయాను. నువ్వు ఇచ్చిన డ్యాన్స్ శిక్షణతో నా డ్యాన్స్ ను మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాను. మీ స్పందనతో మా వీడియోకు సానుకూల స్పందన ఏర్పడుతుందని అనుకుంటున్నాను. నేను మరోసారి మిస్ కాకూడని భావిస్తూ, ఇప్పుడే చెప్తున్నా, హ్యాపీ బర్త్ డే ఇన్ అడ్వాన్స్” అని చెప్పారు. దీనికి రామ్ చరణ్ రియాక్ట్ అయ్యారు. “త్వరలోనే మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను. మీ విషెస్ కు థ్యాంక్స్” అని చెప్పారు.

Read Also: అక్కడ రాజు, ఇక్కడ బానిస- ‘ది గోట్ లైఫ్’ గురించి పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Continues below advertisement