Tillu Square Movie First Review: 'టిల్లు ఈజ్ బ్యాక్, సినిమా బ్లాక్ బస్టర్' అంటున్నారు ఆల్రెడీ 'టిల్లు స్క్వేర్' చూసిన సినీ ప్రముఖులు. స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన 'డీజే టిల్లు' థియేటర్లలో భారీ సక్సెస్ సాధించింది. ఓటీటీల్లో, టీవీల్లోనూ వీక్షకుల్ని అలరించింది. ఆ సినిమాకు సీక్వెల్ (DJ Tillu Sequel Review)గా సిద్ధూ జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్' చేశారు. మార్చి 29న థియేటర్లలో విడుదల కానుంది. అయితే... కొందరికి ముందుగా సినిమా చూపించారు. వాళ్లంతా బ్లాక్ బస్టర్ అంటున్నారు. 'టిల్లు స్క్వేర్' ఫస్ట్ రివ్యూలు ఎలా ఉన్నాయి? అనేది చూస్తే... 


'మ్యాడ్'కు తాత తీశారు - భీమ్స్ సిసిరోలియో
'టిల్లు స్క్వేర్'కు భీమ్స్ సిసిరోలియో రీ రికార్డింగ్ చేశారు. లాస్ట్ ఇయర్ 'బలగం', 'మ్యాడ్', ఈ ఏడాది 'రజాకార్' సినిమాలతో ఆయన విజయాలు అందుకున్నారు. 'మ్యాడ్' నిర్మాతలతో ఆయన రెండో సినిమా 'టిల్లు స్క్వేర్'. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ... ''హిట్టు కాదు, నా దృష్టిలో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం. నా మాటలు గుర్తు పెట్టుకోండి... బ్లాక్ బస్టర్. 'మ్యాడ్' సినిమా చూసినప్పుడు చెప్పా... నెక్స్ట్ లెవల్ అని! ఇప్పుడు దాని తాతను తీశారు. దాని పేరే 'టిల్లు స్క్వేర్'' అని చెప్పారు. ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెంచారు.


ఇంటర్వెల్‌కే బ్లాక్ బస్టర్ అంటారు - కళ్యాణ్ శంకర్
'మ్యాడ్' దర్శకుడు కళ్యాణ్ శంకర్ సైతం సినిమా బ్లాక్ బస్టర్ అని అంచనాలు పెంచారు. 'టిల్లు స్క్వేర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ... ''ఇప్పటి వరకు మాట్లాడిన వారంతా ట్రైలర్ చూసి చెబుతున్నారు. నేను సినిమా చూసి వచ్చా... మిక్సింగ్ థియేటర్లో! ఆడియన్స్ ఇంటర్వెల్‌కే బ్లాక్ బస్టర్ అని చెబుతారు. లాస్ట్ వరకు ఆగాల్సిన అవసరం లేదు. అంత అద్భుతంగా వచ్చింది. డాడీ క్యారెక్టర్, అనుపమ గారి క్యారెక్టర్, మార్కస్ క్యారెక్టర్... వీళ్ళు ముగ్గుర్నీ గుర్తు పెట్టుకోండి. ఎందుకు చెప్పానో సినిమా చూశాక మీకు తెలుస్తుంది. సినిమా మామూలుగా రాలేదు'' అని చెప్పారు.


Also Read: తండ్రినే మించిన తనయుడిగా ఎదిగిన రామ్ చరణ్ - ఆయన పడిన కష్టం ఎంత? అసలు అది ఎలా సాధ్యమైంది?


ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్, ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న 'తెలుసు కదా' సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్న నీరజా కోన సైతం సినిమాలో కొంత భాగం చూశారు. 'టిల్లు స్క్వేర్' ఆద్యంతం అలరిస్తుందని ఆమె చెప్పారు.


Also Read: పృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - సినిమా ఎలా ఉందంటే?



'డీజే టిల్లు' చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా... 'టిల్లు స్క్వేర్'ని మల్లిక్ రామ్ తెరకెక్కించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేశారు. రామ్ మిరియాల, అచ్చు రాజమణి స్వరాలు అందించగా... భీమ్స్ సిసిరోలియో రీ రికార్డింగ్ చేశారు. అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) కథానాయికగా నటించారు. 'డీజే టిల్లు'లో సందడి చేసిన నేహా శెట్టి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం.