Nara Rohit Prathinidhi 2 Teaser: ఎట్టకేలకు నారా రోహిత్‌ ప్రతినిథి నుంచి అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చి నెలలు గుడస్తున్న పెద్దగా అప్‌డేట్స్‌ ఏం బయటకు రావడం లేదు. గతేడాది ఆగష్ట్‌లో సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా నుంచి కాన్సెప్ట్‌ పోస్టర్‌, ఫస్ట్‌లుక్‌ తప్పితే మరే అప్‌డేట్‌ లేదు. అసలు ప్రతినిధి మూవీ షూటింగ్‌ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ప్రతినిధి నుంచి ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. ఈ మూవీ టీజర్‌ రేపు విడుదల చేస్తున్నట్టు తాజాగా జర్నలిస్ట్‌ మూర్తి ట్వీట్‌ చేశారు.


కాగా ఇది 9 ఏళ్ల కిందట నారా రోహిత్ నటించిన 'ప్రతినిధి' సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ళ రాజేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు మహతీ స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, నాని చెమిడిశెట్టి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. కాగా, 9 ఏళ్ల కిందట నారా రోహిత్ నటించిన 'ప్రతినిధి' సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్ లో 'ప్రతినిధి' మూవీ కూడా ఒకటిగా నిలిచింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు కానీ బుల్లితెరపై మాత్రం సంచలనాల సృష్టించింది. 






సినిమాలో ఓ కామన్ మ్యాన్ గా నారా రోహిత్ నటన కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రభుత్వం చేసే అన్యాయాలను ప్రశ్నించే ఒక సామాన్య వ్యక్తి పాత్రలో నారా రోహిత్ అదరగొట్టాడు. దీంతో ఇదే సినిమా సీక్వెల్ తో ఇప్పుడు నారా రోహిత్ మళ్లీ రీఎంట్రీ ఇస్తుండడం ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై మంచి అంచనాలను ఏర్పరిచింది. ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ రేంజ్ లో సీక్వెల్ ఉంటే కనుక కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయి నారా రోహిత్ కి మంచి కం బ్యాక్ ఇస్తుందని చెప్పొచ్చు.


Also Read: మంచులో సితారతో గౌతమ్‌ ఆటలు - ఆ స్టైల్‌ చూశారా, అచ్చం తండ్రిలాగే!


ఇదిలా ఉంటే 'బాణం', 'సోలో', 'అసుర', 'రౌడీ ఫెలో', 'ప్రతినిధి' లాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నారా రోహిత్.   అయితే, నారా వారి హీరో నుంచి సినిమా వచ్చి చాలా రోజులు అయ్యింది. చివరగా ఐదేళ్ల కింద వచ్చిన 'వీర భోగ వసంత రాయలు' సినిమాలో కనిపించాడు ఈ నారా వారబ్బాయి. ఈ సినిమా తర్వాత మళ్లీ కెమెరా ముందు కనిపించలేదు. అయితే ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రతినిథితో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. మరి ఈ మూవీ ఈ నారా హీరో కెరీర్‌ ఎంత ప్లస్‌ అవుతుందో చూడాలి.