Gautam Ghattamaneni: మంచులో సితారతో గౌతమ్ ఆటలు - ఆ స్టైల్ చూశారా, అచ్చం తండ్రిలాగే!
Gautham Ghattamaneni Photos: సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఘట్టమనేని వారసురాలిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడానికి సితార సిద్ధమవుతుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకానీ ఇండస్ట్రీ ఎంట్రీకి ముందే సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన క్యూట్ క్యూట్ పిక్స్, డ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
ఇదంతా అందరికి తెలిసిందే. అయితే ఈసారి గౌతమ్ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు. తాజాగా తన చెల్లి సితారతో కలిసి మంచులో ఆటలాడిన ఫోటోలను షేర్ చేశాడు గౌతమ్.
ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. 'స్నోమ్యాక్సింగ్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోల్లో అందరి దృష్టంతా గౌతమ్‌పై పడింది. అచ్చం వింటెజ్ మహేష్‌లా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం సితార, గౌతమ్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. అంతేకాదు ఈ ఫోటోల్లో గౌతమ్ తన తండ్రిలా ఫోజు ఇచ్చాడు. ఇది చూసి అచ్చం నాన్న స్టైల్ అంటున్నారు.
మరికొందరైతే 'ప్రిన్స్ సూపర్ స్టార్ గౌతమ్' అంటూ అప్పుడే బిరుదు కూడా ఇచ్చేస్తున్నారు. ఏదేమైన సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపించే గౌతమ్‌ని ఇలా చూడటంతో ఘట్టమనేని ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే సితార పాప ఇండస్ట్రీకి రాకముందే తన లుక్స్, స్కిల్స్‌తో సర్‌ప్రైజ్ చేసింది. వెండితెర ఎంట్రీ ఇవ్వకముందే తనదైన ఫాలోయింగ్‌తో ఓ జ్యూవెల్లరి యాడ్‌లో నటించింది.
ఈ యాడ్ కోసం సితార ఏకంగా కోటికి పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఇక తన తొలి సంపాదనను పేదలకు ఇచ్చినట్టు ఓ ప్రెస్‌మీట్ వెల్లడించింది.