రానా దగ్గుబాటి (Rana Daggubati) వెండితెరపై కథానాయకుడిగా కనిపించి ఏడాది దాటింది. 'విరాట పర్వం' తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు. ఆ మధ్య నిఖిల్ 'స్పై'లో అతిథి పాత్రలో మెరిశారు. నటన నుంచి కొంత విరామం తీసుకున్న ఆయన... రజనీకాంత్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. 


రజనీ 170వ సినిమాలో రానా కీలక పాత్ర!
'విరాట పర్వం' తర్వాత రానా మరో సినిమా ప్రకటించలేదా? అంటే... చేశారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'హిరణ్యకశ్యప'ను అనౌన్స్ చేశారు. అయితే... అది సెట్స్ మీదకు వెళ్ళడానికి ఇంకా సమయం పడుతుంది. దానికంటే ముందు రజనీకాంత్ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. 


సూర్య కథానాయకుడిగా నటించిన 'జై భీమ్' సినిమా గుర్తు ఉందిగా! ఆ క్లాసిక్ తీసిన దర్శకుడు టి.జె. జ్ఞానవేల్. అతని దర్శకత్వంలో రజనీకాంత్ ఓ సినిమా (Thalaivar 170) చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజా సమాచారం ఏమిటంటే... రానా దగ్గుబాటి కూడా ఆ సినిమాలో ఉన్నారట! వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల అవుతుంది. సో... రెండేళ్ళ తర్వాత రానా రీ ఎంట్రీ ఇవ్వబోయేది ఈ సినిమాతోనే అవుతుంది ఏమో!?


Also Read : శెట్టి పోలిశెట్టికి 'మెగా' అభినందన - హీరో, దర్శకుడిని ఇంటికి పిలిచి...



అమితాబ్ బచ్చన్... ఫహాద్ ఫాజిల్ కూడా!
Thalaivar 170 Update : తలైవర్ 170 చిత్రీకరణ ఈ నెలాఖరు నుంచి మొదలు పెట్టడానికి జోరుగా సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించనున్నారనేది తెలిసిన విషయమే. అలాగే, 'పుష్ప'తో తెలుగు చిత్రసీమకు పరిచయమైన మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahad Fazil), మలయాళ నటి మంజూ వారియర్ కూడా నటిస్తున్నారు. రజనీకాంత్ సినిమా ప్రయాణంలో ఇది చాలా స్పెషల్ సినిమా అవుతుందని, అన్ని భాషల నటీనటులు ఉండేలా దర్శకుడు జ్ఞానవేల్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని టాక్.  


Also Read రికార్డు రేటుకు పవన్ కళ్యాణ్ 'ఓజీ' ఓవర్సీస్ రైట్స్ - రేటు ఎంతో తెలుసా?


ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇందులో రజనీ రిటైర్డ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఎన్కౌంటర్ విధానం లేదా వ్యవస్థ మీద పోరాటం చేసే వ్యక్తిగా సూపర్ స్టార్ పాత్ర ఉంటుందట. రజనీతో లైకా ప్రొడక్షన్స్ సంస్థకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. వాళ్ళ కలయికలో వచ్చిన మొదటి సినిమా '2.0' రికార్డులు క్రియేట్ చేసింది. 'దర్బార్' సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ, అందులో రజనీకాంత్ లుక్కు, యాక్షన్ సన్నివేశాలకు మంచి పేరు వచ్చింది. 'లాల్ సలాం'ను కూడా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. చూస్తుంటే... రజనీతో మరిన్ని సినిమాలు చేసేలా ఉన్నారు.


క్రికెట్ & గొడవల నేపథ్యంలో 'లాల్ సలాం'
క్రికెట్ నేపథ్యంలో 'లాల్ సలాం' రూపొందుతోంది. అయితే... ఆ సినిమాలో క్రికెట్ ఒక్కటే కాదు, ఘర్షణలు సైతం ఉంటాయి. ఇందులో రజనీకాంత్ లుక్ కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఆయన ముస్లిం రోల్ చేస్తున్నారు. మొయిదీన్ భాయ్ గెటప్ సూపర్ స్టార్ అభిమానులను ఆకట్టుకుంది. అతిథి పాత్ర అయినప్పటికీ... తండ్రిని కుమార్తె ఎలా ప్రజెంట్ చేస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'జైలర్' సినిమా బాక్సాఫీస్ బరిలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. రూ. 600 కోట్లకు పైగా ఆ సినిమా కలెక్ట్ చేయడంతో రజనీకాంత్ తదుపరి సినిమాలపై అంచనాలు పెరిగాయి. 



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial