తెలుగు తెర అరుంధతి, దేవసేన అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' (Miss Shetty MR Polishetty Movie). ఆమెకు జోడీగా, కథానాయకుడి పాత్రలో 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు' ఫేమ్ నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) నటించారు. ఈ గురువారం (సెప్టెంబర్ 7న) ప్రేక్షకుల ముందుకొస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. విడుదల ముందు ఈ చిత్రానికి 'మెగా' అభినందన లభించింది. 


సినిమా చూసిన చిరంజీవి... 
దర్శక నిర్మాతలకు అభినందన!
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రాన్ని సోమవారం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. సినిమా చూసిన ఆయన... హీరో నవీన్ పోలిశెట్టి, దర్శకుడు మహేష్ బాబును ఇంటికి పిలిపించుకుని అభినందించారు. మంచి సినిమా తీశారంటూ అప్రిషియేట్ చేశారని తెలిసింది. విడుదలకు ముందు 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'కి ఇది మంచి బూస్ట్ అని చెప్పవచ్చు. సినిమా విడుదల సమయానికి హీరో నవీన్ పోలిశెట్టి అమెరికా వెళ్లనున్న సంగతి తెలిసిందే. అక్కడ సినిమాను ప్రమోట్ చేయడంతో పాటు ప్రేక్షకులతో కలిసి సినిమా చూడనున్నారు. 


Also Read : రికార్డు రేటుకు పవన్ కళ్యాణ్ 'ఓజీ' ఓవర్సీస్ రైట్స్ - రేటు ఎంతో తెలుసా?


 






'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' రన్ టైమ్ ఎంత?
Miss Shetty MR polishetty Run Time : 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'కి సెన్సార్ బోర్డు 'యు / ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమాకు పెద్దలతో పాటు పిల్లలు కూడా వెళ్లొచ్చు అన్నమాట! ఇక, నిడివి విషయానికి వస్తే... సుమారు రెండున్నర గంటలు. 


'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఏమీ లేవని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పిల్లలు కనడానికి పెళ్లి అవసరం లేదంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్, ఆ సినిమా కాన్సెప్ట్ కారణంగా యు / ఏ ఇచ్చారట. కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ నేపథ్యంలో తీసిన కామెడీ సీన్లు చాలా బాగా వచ్చాయని తెలిసింది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది.


Also Read 'డెవిల్' - కళ్యాణ్ రామ్ సినిమా కోసం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా భారీ సెట్స్!



నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ పాత్రలో, అనుష్క శెట్టి ఫేమస్ షెఫ్ పాత్రలో నటించిన ఈ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించారు. అనుష్కకు 48వ చిత్రమిది. యూవీ క్రియేషన్స్ సంస్థలో 'మిర్చి', 'భాగమతి' చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ మీద కన్నేశారు.


న‌వీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి, అభినవ్ గోమఠం, మురళీ శర్మ, తులసి తదితరులు నటించిన ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ :  యువీ క్రియేష‌న్స్‌, నిర్మాత‌లు:  వంశీ - ప్ర‌మోద్‌, ర‌చ‌న‌ & ద‌ర్శ‌క‌త్వం:  మ‌హేష్ బాబు .పి, సంగీతం : రధన్, కూర్పు : కోటగిరి వెంకటేశ్వర రావు, ఛాయాగ్రహణం :  నిర‌వ్ షా, నృత్యాలు :  రాజు సుంద‌రం & బృందా, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌ : రాజీవ‌న్‌. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial