పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఓజీ' (OG Movie). 'దే కాల్ హిమ్ ఓజీ' అనేది ఫుల్ టైటిల్. ఓజీ అంటే 'ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' అని అర్థం. ముంబై నేపథ్యంలో మాఫియాను ఎదిరించి నాయకుడిగా ఎదిగిన వ్యక్తి కథతో రూపొందుతున్న సినిమా ఇది. ఇటీవల 'ఓజీ' వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. 


'ఓజీ' వీడియో గ్లింప్స్ అదుర్స్...
పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!  
'ఓజీ' వీడియో గ్లింప్స్ (OG Teaser)కు లభిస్తున్న స్పందన పట్ల పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. వాళ్ళకు ఆ టీజర్ విపరీతంగా నచ్చింది. అంతే కాదు సగటు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఆ విజువల్స్ ద్వారా సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు దర్శకుడు సుజీత్. ఆల్రెడీ సినిమా బిజినెస్ సైతం స్టార్ట్ అయ్యిందని సమాచారం. 


రికార్డు రేటుకు 'ఓజీ' ఓవర్సీస్ రైట్స్!?
OG Overseas Rights : 'ఓజీ' ఓవర్సీస్ రైట్స్ గురించి ఆల్రెడీ డిస్కషన్స్ మొదలు పెట్టినట్లు సమాచారం. నిర్మాత డీవీవీ దానయ్య 20 కోట్ల రూపాయలు పైగా కోట్ చేసినట్లు తెలిసింది. ఫార్స్ ఫిలిమ్స్ రూ. 13 కోట్లకు సొంతం చేసుకుందని టాక్. డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొన్న వాళ్ళకు లాభాలు రావాలంటే... సుమారు 3 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేయాలి. మన కరెన్సీలో సుమారు 24 కోట్లు కలెక్ట్ చేస్తే గానీ బ్రేక్ ఈవెన్ కాదు. 


Also Read : పవన్ కళ్యాణ్ లుక్ & గన్స్ నుంచి కథ వరకు - 'ఓజీ' టీజర్‌లో ఇవి గమనించారా? 


పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'Hungry Cheetah' అంటూ 'ఓజీ' బృందం విడుదల చేసిన వీడియోలో తమన్ నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.



''నెత్తురు మరిగిన హంగ్రీ చీతా
శత్రువును ఎంచితే మొదలు వేట..
చూపు కానీ విసిరితే ఓర కంట..
డెత్ కోటా.. కన్ఫర్మ్ అంట..


ఎవ్వడికీ అందదు అతని రేంజు..
రెప్ప తెరిచేను రగిలే రివేంజు..
పవరు అండ్ పొగరు..ఆన్ ది సేమ్ పేజ్..
ఫైర్ స్టార్మ్ లాంటి రేజు...'' అంటూ గూస్ బంప్స్ అందించారు.  


Also Read : 'డెవిల్' - కళ్యాణ్ రామ్ సినిమా కోసం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా భారీ సెట్స్!


డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య 'ఓజీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ హీరోగా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాలో నిర్మించారు. 'సాహో' తర్వాత సుజీత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కూడా ఇదే.


'ఓజీ'లో ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు తొలి తెలుగు చిత్రమిది. 'బుట్ట బొమ్మ'తో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమైన తమిళ నటుడు, 'ఖైదీ' & 'విక్రమ్' ఫేమ్ అర్జున్ దాస్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్ ఉన్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : ఏఎస్ ప్రకాష్, ఛాయాగ్రహణం : రవి కె చంద్రన్, సంగీతం : ఎస్. థమన్, నిర్మాత : డీవీవీ దానయ్య, రచన - దర్శకత్వం : సుజీత్.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial