తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్ ఖాన్


ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ‘జవాన్‘ విడుదల నేపథ్యంలో మూవీ యూనిట్ తో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.  భార్య గౌరీ ఖాన్, కూతురు సుహానా ఖాన్  కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. హీరోయిన్ నయనతార, ఆమె భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్, ‘జవాన్‘ దర్శకుడు అట్లీ కుమార్ వేంకటేశ్వరుడి సేవలో పాల్గొన్నారు. అంతకు ముందు షారుఖ్ ఖాన్ కు తిరుమల తిరుపతి దేవాస్థానం అధికారులు సాదర స్వాగతం పలికారు. దగ్గరుండి దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం గర్భగుడిలో కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేయించారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు షారుఖ్ ఖాన్ కుటుంబ సభ్యుతలో పాటు నయనతా కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. షారుఖ్, నయనతారను పట్టువస్త్రాలతో సత్కరించారు. ఇక సంప్రదాయ దుస్తులు వేసుకుని షారుఖ్ కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. పట్టుపంచెలో బాలీవుడ్ బాద్ షా కనిపించారు.


తొలిసారి తిరుమలకు వచ్చిన బాలీవుడ్ బాద్ షా


షారుఖ్‌, నయనతార జంటగా నటించిన ‘జవాన్‌’ మూవీ ఈ నెల 7న ప్రపంచ వ్యాప్తంగా అట్టహాసంగా విడుదల కానుంది. ఇక ఇప్పటికే ‘జవాన్’ చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే ‘జవాన్’ టీమ్ చెన్నైకి వచ్చింది.  ఇవాళ ఉదయం షారుఖ్ ఖాన్, నయనతార, మరికొంతమంది చిత్రయూనిట్ తో కలిసి తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. షారుఖ్ ఖాన్ తొలిసారి తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు.  మొదటిసారి ఆయన తిరుమలకు రావడంతో ఆలయంలోకి నడిచి వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ధ్వజస్తంభం నుంచి బయటకు వస్తూనే భక్తులకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత భక్తులు,  అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అందరికీ సెల్ఫీలు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ‘జవాన్‘ చిత్రానికి తమిళ దర్శకుడు తెరకెక్కించడం, తెలుగుతో పాటు తమిళంలో ఈ సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో మంచి హిట్ సాధించాలని  చిత్రబృందం శ్రీవారిని వేడుకుంది.    






ఈ నెల 7న ‘జవాన్‌’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల


ఇక ‘జవాన్’ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలై గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్లు మూవీపై భారీగా అంచనాలు పెంచాయి.  గతనెల 31న విడుదలై ఈ సినమా ట్రైలర్‍కు ఓ రేంజిలో స్పందన వచ్చింది. షారుఖ్ డైలాగ్స్ ఆయన అభిమానులతో పాటు సినీ లవర్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో షారుక్ ఖాన్ డ్యుయెల్ రోల్ పోషించబోతున్నారు. తండ్రి, కొడుకు పాత్రల్లో కనిపించబోతున్నారు. తమిళ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  లేడి సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ బ్యూటి దీపికా పదుకొణె,  విజయ్ సేతుపతి, ప్రియమణి,  సాన్య మల్హోత్రా, యోగిబాబు, అసుర్ సిరీస్ ఫేమ్ రిధి డోగ్రా, ఇజాజ్ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు.


Read Also: డబ్బులిచ్చి మరీ నా మీద, నా సినిమాపైన దాడులు చేయిస్తున్నారు - విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial