వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు తమకు దగ్గరలో ఆలయాలకు భగవంతుని దర్శనం కోసం బారులు తీరారు. టాలీవుడ్ హీరోయిన్ ఒకరు అయితే తిరుమల తిరుపతి వెళ్లారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి మెట్ల మార్గంలో కాలినడకన కొండకు చేరుకున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?


మోకాళ్ల మీద తిరుమల చేరుకున్న నందిని
నందిని రాయ్... దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మించిన 'వారసుడు' సినిమాలో శ్రీకాంత్ ప్రేయసి పాత్రలో నటించారు. అంతకు ముందు కథానాయికగా నీలకంఠ దర్శకత్వం వహించిన 'మాయ', సుధీర్ బాబు సరసన 'మోసగాళ్లకు మోసగాడు'తో పాటు పలు సినిమాలలో నటించారు. 


నందినికి భక్తి ఎక్కువ. పండుగలు, ప్రత్యేకమైన సందర్భాలలో ఆవిడ తప్పకుండా భగవంతుని దర్శనం చేసుకుంటారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మోకాళ్ల మెట్టలో మోకాళ్ల మీద మెట్లు తిరుమల చేరుకున్నారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చారు.


Also Read: 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే? 






'బిగ్ బాస్' తెలుగు సీజన్ 2లో నందిని రాయ్ పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత 'షూట్ అవుట్ ఎట్ ఆలేరు', 'మెట్రో కథలు', 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్', 'గాలివాన' వంటి వెబ్ సిరీస్‌లలో ఆవిడ నటించారు. సినిమాలతో పాటు ఓటీటీ ప్రాజెక్టులు కూడా చేయడం వల్ల ఆమెకు డిజిటల్, టీవీ వీక్షకులలో ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు నందిని రెండు మూడు సినిమాలలో నటిస్తున్నట్లు సమాచారం. వాటి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.


Also Read: 'కార్తీక దీపం 2'కు 'గుడి గంటలు' నుంచి డేంజర్ బెల్స్... టీఆర్పీలో ఈ వీక్ టాప్ 10 సీరియల్స్ ఏవో తెలుసా?