నేషనల్ క్రష్ రష్మిక మందన్న పలు పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే 'పుష్ప 2' సినిమాతో భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా చేస్తున్న 'సికందర్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్లో జాయిన్ కావాల్సిన రష్మిక, అంతకంటే ముందే జిమ్ లో వ్యాయామం చేస్తుండగా గాయపడినట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం 'సికందర్' మూవీ షూటింగ్ ఆగిపోయింది. 


రష్మికకు గాయం... షూటింగ్ కు బ్రేక్  


'సికిందర్' మూవీ షూటింగ్ ఈరోజు అంటే జనవరి 10న చివరి షెడ్యూల్ మొదలు కావాల్సి ఉంది. అయితే తాజాగా ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక మందన్న జిమ్ లో వ్యాయామం చేస్తున్నప్పుడు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఆమె గాయాన్ని పరిశీలించిన వైద్యులు రష్మికను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. దీంతో రష్మిక మందన్న కోలుకొని మళ్లీ సెట్స్ పైకి వచ్చేదాకా 'సికందర్' మూవీ షూటింగ్ ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ చివరి షెడ్యూల్ కోసం ముంబైలోని ఓ భారీ స్టూడియోలో భారీ సెట్ ని కూడా సిద్ధం చేశారు. అందులో రష్మిక, సల్మాన్ కాంబోలో కీలక సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. కానీ రష్మిక మందన్న గాయపడడం వల్ల షూటింగ్ ను మొదలు పెట్టలేకపోయారు.


వాయిదా టెన్షన్ 


'సికందర్' మూవీని మార్చిలోనే రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు అనుకోని విధంగా రష్మిక మందన్న గాయపడడంతో అసలు అనుకున్న టైమ్ కి మూవీ పూర్తవుతుందా? అన్న టెన్షన్ పట్టుకుంది సల్మాన్ ఫ్యాన్స్ ను. అయితే టీం మాత్రం మూవీని చెప్పిన టైమ్ కి రిలీజ్ చేస్తామని నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై అటు చిత్రబృందం గానీ, ఇటు రష్మిక టీం గానీ అఫిషియల్ గా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. 


హైప్ పెంచేసిన టీజర్  


అమీర్ ఖాన్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'గజిని'తో హిందీ చిత్ర సీమకు దర్శకుడిగా పరిచయం అయ్యారు తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్. ఆయన దర్శకత్వం వహిస్తున్న రెండవ హిందీ మూవీ 'సికందర్'. ఈ చిత్రానికి సాజిద్ నదియాడ్ వాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ 'కిక్' తర్వాత దాదాపు ఒక దశాబ్దం తర్వాత సాజిద్ నడియాడ్‌వాలా - సల్మాన్ ఖాన్ కాంబోలో వస్తున్న సినిమా. 'సికందర్' మూవీని 2025 ఈద్ సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ఈ మోస్ట్ అవైటింగ్ మూవీలో ప్రతీక్ బబ్బర్, సత్యరాజ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే 'సికందర్' నుంచి విడుదలైన టీజర్‌లో సల్మాన్‌ డాషింగ్‌ అవతార్‌ని చూపించారు. ఈ టీజర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలను పెంచేసింది. 


రష్మిక లైనప్ 


ప్రస్తుతం రష్మిక ఆ గాయం నుంచి కొలుకుంటోంది. మరోవైపు రష్మిక రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ' ది గర్ల్‌ఫ్రెండ్‌'లో నటించనుంది. ఈ సినిమా టీజర్‌ను ఇటీవల విజయ్ దేవరకొండ ఆవిష్కరించారు. అలాగే ఆమె నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'చావా' రిలీజ్ కు రెడీగా ఉంది.



Also Readవెండితెరకు రాజకీయ రంగులు... తెలుగులో బెస్ట్ పొలిటికల్ ఫిలిమ్స్ - 'గేమ్ చేంజర్'కు ముందు... మీరెన్ని చూశారు?