KGF2 Ticket Rates: తెలంగాణలో 'కెజియఫ్ 2' టికెట్ రేట్స్ పెరిగాయ్, రోజుకు ఐదు షోలు

తెలంగాణలో 'కె.జి.యఫ్ 2' టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ... ఈ రోజు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Continues below advertisement

KFG Chapter 2 Movie Ticket Rates In Telangana: కన్నడ స్టార్ యష్ హీరోగా నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ 'కె.జి.యఫ్ 2' మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం విడుదలవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ... నేడు జీవో జారీ చేసింది.

Continues below advertisement

సినిమా విడుదలవుతున్న తేదీ (ఏప్రిల్ 14) నుంచి నాలుగు రోజుల పాటు (అంటే ఏప్రిల్ 18, ఆదివారం) వరకూ రేట్స్ పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్ స్క్రీన్లు, ఐమాక్స్, సింగల్ స్క్రీన్ థియేటర్స్ ఒక్కో టికెట్ మీద 50 రూపాయలు.... ఎయిర్ కండిషన్, ఎయిర్ కూల్ థియేటర్లలో ఒక్కో టికెట్ మీద 30 రూపాయల చొప్పున రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది. నాన్ ఏసీ థియేటర్లలో ఎటువంటి మార్పులూ లేవు. నాలుగు రోజుల పాటు ఐదు షోలు వేసుకోవడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

'కె.జి.యఫ్ 2' టికెట్ రేట్స్ మ‌ల్టీప్లెక్స్‌ల‌లో రూ. 350, సింగిల్ స్కీన్స్‌లో రూ. 200 ఉండే అవకాశం ఉంది. రేట్స్ ఏంటనేది ఈ రోజు సాయంత్రం లోపు పక్కాగా తెలుస్తుంది. 

తెలంగాణలో ఇంకా 'కె.జి.యఫ్ 2' బుకింగ్స్ ఓపెన్ కాలేదు. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ఓపెన్ కావచ్చని తెలుస్తోంది. సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Also Read: కండోమ్స్‌కు నిధి అగర్వాల్ ప్రచారం - సోషల్ మీడియాలో దుమ్ము దుమారం


ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన 'కె.జి.యఫ్ 2'లో సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్.

Also Read: అలియా భట్ - ర‌ణ్‌బీర్‌ కపూర్ పెళ్లి వాయిదా! కన్ఫర్మ్ చేసిన ఆలియా సోదరుడు

Continues below advertisement