Hyper Aadi: 'హైపర్' ఆది ఎక్కడ? 'జబర్దస్త్'లో ఎందుకు కనిపించడం లేదు?

'హైపర్' ఆది స్కిట్స్ కోసం 'జబర్దస్త్' కామెడీ షో చూసే ప్రేక్షకులు ఉన్నారు. కొన్ని రోజులుగా వాళ్ళ మదిలో ఒక్కటే సందేహం... ఆది స్కిట్స్ ఎందుకు రావడం లేదని!

Continues below advertisement

Where Is Hyper Aadi? 'హైపర్' ఆది ఎక్కడ? 'జబర్దస్త్'లో ఎందుకు కనిపించడం లేదు? కొన్ని రోజులుగా ఆది స్కిట్స్ ఎందుకు రావడం లేదు? తెలుగు టీవీ ప్రేక్షకుల్లో, 'హైపర్' ఆది అభిమానుల్లో ఒక్కటే సందేహాలు!

Continues below advertisement

'జబర్దస్త్'లో చాలా టీమ్స్ ఉన్నాయి. కొన్ని రోజులుగా టీమ్స్, టీమ్ మెంబర్స్‌లో మార్పులు జరుగుతున్నాయి. స్పెషల్ స్కిట్స్ పేరుతో కొత్త టీమ్స్‌ను ట్రై చేస్తున్నారు. అయితే... 'హైపర్' ఆది టీమ్‌లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. సాధారణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త సెలబ్రిటీలను తీసుకొచ్చి స్కిట్స్ చేయడం ఆది స్టైల్. అతడికి, అతడి స్కిట్స్‌కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. అందువల్ల, రెండు మూడు వారాలుగా ఆది కనిపించకపోవడంతో డిస్కషన్ పాయింట్ అయ్యింది. మార్చి 17న ఆది స్కిట్ టెలికాస్ట్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు.

'ఆదిగారు మిమ్మల్ని మిస్ అవుతున్నాం' అని ఒకరు లేటెస్ట్ 'జబర్దస్త్' ప్రోమో కింద కామెంట్ చేశారు. 'ఆది అన్న ఎక్కడ? (Where is Hyper Aadi?) ఆది ఉంటే ప్రేక్షకులకు ఒక ఎనర్జీ' అని ఇంకొకరు కామెంట్ చేశారు. 'ఆది లేకపోతే జబర్దస్త్ లేదు' అని అభిప్రాయపడిన నెటిజన్స్ కూడా ఉన్నారు. ఆది ఎక్కడ? అంటూ వచ్చిన కామెంట్స్ ఒక ఎత్తు అయితే... 'జబర్దస్త్' నుంచి ఆదిని తీసేశారని మరొకరు కామెంట్ చేశారు. 'జబర్దస్త్ నుంచి ఆది టీమ్ ను తీసేశారు. అతడిని మళ్ళీ వెనక్కి తీసుకు రావాలి. మేం ఆది పంచ్ డైలాగులు మిస్ అవుతున్నాం' అని ఒకరు కామెంట్ చేశారు.

Also Read: కండోమ్స్‌కు నిధి అగర్వాల్ ప్రచారం - సోషల్ మీడియాలో దుమ్ము దుమారం

టీవీ ఇండస్ట్రీ టాక్ ఏంటంటే... ఒక సినిమా షూటింగ్ కోసం ఆది అవుట్‌డోర్ షెడ్యూల్‌కు వెళ్లారట. అందువల్ల, 'జబర్దస్త్'కు కొంచెం గ్యాప్ ఇచ్చారట. గతంలో 'తొలిప్రేమ' షూటింగ్ కోసం లండన్ వెళ్ళినప్పుడు కూడా 'జబర్దస్త్'కు కొన్నాళ్ళు ఆది గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ కానుందట. ఈటీవీ కోసం మల్లెమాల ప్రొడ్యూస్ చేస్తున్న డాన్స్ రియాలిటీ షో 'ఢీ'లో ఆది కనిపిస్తున్నారు. ఆ ఎపిసోడ్స్ ముందుగా షూట్ చేశారట. ముందు షూట్ చేయడం వల్లే అఖిల్ సార్థక్ 'బిగ్ బాస్ ఓటీటీ'కి వెళ్లినా... 'ఢీ'లో కనిపిస్తున్నారు.

Also Read: తమిళ స్టార్ విజయ్‌కు షాక్ ఇచ్చిన మలయాళీ డైరెక్టర్








Continues below advertisement
Sponsored Links by Taboola