కార్తీకదీపం (Karthika Deepam ) ఏప్రిల్ 12 మంగళవారం ఎపిసోడ్


హిమ
జ్వాల(శౌర్య)ని కలిసొచ్చిన తర్వాత అదే ఆనందంలో తను పరిచయం అయినప్పటి నుంచీ జరిగినవన్నీ గుర్తుచేసుకుంటుంది హిమ. నేను ఎవరో తెలియనప్పుడే నన్ను తింగరి అని పేరు పెట్టుకున్నావ్, నేను ఎవరో తెలియకనే నాకు అన్నం తినిపించావ్... నీ కోపం పోవాలంటే ఏం చేయాలి...  కోపం తీరిన తర్వాతే అందరికీ ఈ ఫొటో చూపిస్తాను. కోపం తీరకుండా నిన్ను అందరికీ పరిచయం చేశాననుకో ఆ కోపంలో మళ్లీ నువ్వు పారిపోతావ్..మళ్లీ ఎప్పటికీ దొరకవ్...అందుకే నీ కోపం పోయిన తర్వాతే నీ గురించి అందరికీ చెబుతాను అనుకుంటూ.... నేను తింగరి నేను తింగరి అంటూ మంచపై గెంతులేస్తుంటుంది. హిమని అలా చూసి షాక్ అయిన సౌందర్య..నువ్వు హిమవేనా...ఇంత యాక్టివ్ గా ఉన్నావేంటి అని అడిగితే.. ఆనందంగా ఉంటే సంతోషించాలి కానీ అడగకూడదు అని రిప్లై ఇచ్చి వెళ్లిపోతుంది. ఏదేమైనా హిమలో ఈ మార్పు వచ్చిందంటే కారణం నిరుపమ్ అయి ఉంటాడు అనుకుంటుంది సౌందర్య..


Also Read:  వసుధారని వెతుక్కుంటూ వచ్చిన రిషి ఒంటరితనం
ఆనందరావు-నిరుపమ్
నిరుపమ్: శౌర్యని వెతకడంలో హిమ చాలా ట్రై చేస్తోంది,  నేను కూడా హెల్ప్ చేస్తున్నాను...మీరెందుకు ఆ ప్రయత్నం చేయడం లేదంటాడు నిరుపమ్. 
ఆనందరావు: తను మనకు కనిపించకూడదనే వెళ్లిపోయింది... శౌర్య కనిపిస్తే కానీ హిమ ముఖంలో సంతోషం చూడలేం ఏమో...
నిరుపమ్: ఈ మధ్య యాక్టివ్ గా ఉంటోంది కదా తాతయ్య హిమ...
ఆనందరావు: కారణం నువ్వే అనుకుంటా
నిరుపమ్: నేను కాదు తాతయ్య అంటూ శౌర్య ని గుర్తుచేసుకుంటాడు... సందర్భం వచ్చినప్పుడు ఎవరు కారణమో చెబుతాను
ఆనందరావు: హిమలో మార్పు వచ్చినట్టే మీ మమ్మీలో మార్పొస్తే బావుంటుందేమో...
నిరుపమ్: తప్పకుండా మార్పు వస్తుందిలే... మమ్మీ-డాడిని కలిపేందుకు నా ప్రయత్నాలు నాకున్నాయంటూ( ఇందులో కూడా జ్వాల సహాయం తీసుకోవాలి)
ఇంతలో కోపంగా ఎంట్రీ ఇచ్చిన స్వప్న...పాపం చేసిన హిమ సంతోషంగానే ఉంది..దాని చుట్టూ ఉండేవారే బాధపడుతున్నారు...


జ్వాల-నిరుపమ్-హిమ-ఆనంద్
టిఫిన్ సెంటర్ దగ్గర ఏదో ఆలోచనలో ఉన్న జ్వాల దగ్గరకు వచ్చిన రవ్వ ఇడ్లీ( ఆనంద్) ఏం ఆలోచిస్తున్నావ్ అంటూ ఓ టీ ఆర్డర్ ఇస్తాడు. నాకు టీ ఆర్డర్ ఇస్తున్నావ్ ఏంటని అంటే..నాకు కొన్ని పుస్తకాలు అవసరం ఉన్నాయి కొనుక్కునేందుకు తీసుకెళతావని అడుగుదామని అంటాడు. నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావ్ కదా నీ చదువు నువ్వు చదువుకో అన్నీ కొంటా అంటుంది. అదిగో డాక్టరమ్మ వచ్చిందంటాడు రవ్వఇడ్లీ( ఆనంద్).   నీ నుంచి యాక్టివ్ నెస్ అప్పుకావాలన్న నిరుపమ్... ఈ తింగరిని నీ చేతుల్లో పెడుతున్నా నీలా మార్చెయ్ అని అడుగుతాడు. ఈ తింగరిని టోటల్ గా మార్చేస్తానని అంటే..నాకు కావాల్సింది కూడా నీతో ఉండటమే శౌర్య అనుకుంటుంది హిమ. డాక్టరమ్మ ఆ కోట్ నేను వేసుకోవచ్చా అని డాక్టర్ కోట్ అడిగితే... ఆకోటుకి ఓ గౌరవం ఉందని జ్వాల అంటే...పర్వాలేదులే జ్వాలా మన రవ్వఇడ్లీనే కదా అని ఇస్తుంది హిమ. కాసేపు డాక్టర్ లా యాక్ట్ చేస్తాడు ఆనంద్... ఓ ఫొటో తీసుకుంటాడు. జ్వాల (శౌర్య)-డాక్టరమ్మ(హిమ)తో కలసి రవ్వ ఇడ్లీ ( ఆనంద్) ఓ ఫొటో దిగుతాడు. ఆ తర్వాత హిమ-శౌర్య ఫొటోస్ దిగుతారు....


Also Read:   శౌర్య ద్వేషాన్ని ప్రేమగా మార్చుకుంటానన్న హిమ-తగ్గేదే లే అంటున్న రౌడీ బేబీ
కాఫీ బావుంది స్వప్న అన్న ఆనందరావు... అన్ని పనులు బాగా చేస్తావ్ కానీ ఈ పంతం ఏంటో అనగానే ఫైర్ అవుతుంది స్వప్న. ఎన్నిసార్లు చెప్పినా పదే పదే అదే విషయం ఎందుకు మాట్లాడతారు డాడీ అంటుంది. మీరెంత చెప్పినా మమ్మీపై నా అభిప్రాయం మారదు, మీ అల్లుడిగారిపై కోపం పోదు.  
ఆనందరావు: దీప ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కార్తీక్ కోసం ఎదురుచూసింది, వదులుకోవాలని అనుకోలేదు....
స్వప్న: ఇంతకు మించిన ఉదాహరణలు నేను చెప్పగలను...మీ అల్లుడిపై మంచి అభిప్రాయం ఉంటే వెళ్లి సన్మానం చేయండి 


కట్ చేస్తే శౌర్య ఆటో డ్రైవ్ చేస్తుంటే హిమ వెనుక కూర్చుని చిన్నప్పుడు ఆడుకున్న సందర్భాలన్నీ గుర్తుచేసుకుంటుంది. నీతో రోజూ సమయం గడిపితేనే నీ కోపం తగ్గేలా చేయగలను, నీతో మాట్లాడాలి కబుర్లు చెప్పాలి నిన్ను మళ్లీ నా శౌర్యగా  దగ్గరకు తీసుకోవాలి అనుకుంటుంది. 
హిమ: జ్వాల నీ పేరు బావుంది ఈ పేరు ఎవరు పెట్టారని అడుగుతుంది. 
జ్వాల: కోపంగా ఆటోదిగిన జ్వాల...పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగొద్దు...మా అమ్మా-నాన్న లేరు, నోరు మూసుకుని కూర్చో, నన్నేమీ అడగొద్దు అంటుంది. 
హిమ: ఎందుకంత కోపం అడిగితే చెప్పొచ్చుకదా, మనం ఫ్రెండ్స్ కదా, మాట్లాడకపోతే మాట్లాడు అంటావ్... మాట్లాడితే ఏం అడిగినా చెప్పవ్, నన్ను మీ చెల్లెల్ని అనుకో..అప్పుడు ఇవన్నీ అనగానే జ్వాల: మళ్లీ ఆటో ఆపి హిమను కిందకు దించుతుంది. నాకు నచ్చని పదాలు , బంధాలు అక్కా చెల్లి, నాకు కొన్ని బంధాలు నచ్చవ్...ఏది పడితే అది ఎప్పుడు పెడితే అప్పుడు అడగొద్దు.. డాక్టర్ సాబ్ చెప్పారని నిన్ను నాతో తిప్పుకుంటున్నాను, ప్రశ్నలు వేశావంటే నాకు శత్రువులా మారిపోతావ్ అని హెచ్చరిస్తుంది.
హిమ: అంటే తెలియక ఏదో మాట్లాడాలి కదా అని అడిగాను 
జ్వాల: నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇదిగో అంటూ చేతిపై పచ్చబొట్టు చూపిస్తుంది. ఇదే అన్ని ప్రశ్నలకు జవాబు, జవాబు దొరకని ప్రశ్న. ఇంకోసారి నన్నేమి అడగొద్దు..ఈ ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటే నాకొచ్చే కోపానికి ప రిస్థితి వేరేగా ఉండేది అంటూ హిమని అక్కడే వదిలేసి వెళ్లిపోతుంది...
హిమ: నేను నీకు దగ్గరవుదాం అనుకుంటే నువ్వు నాకు దూరంగా వెళుతున్నావా శౌర్య...నువ్వెంత దూరం వెళ్లినా నేను నీడలా నీ వెంటే వస్తాను...నీకెంత కోపం వచ్చినా నీ కోపాన్ని నేను భరిస్తాను ఆ కోపం తగ్గేలా చూసుకుంటాను....


రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
నీ బండి పేపర్స్ వ్యాలిడిటీ అయిపోయింది కదా చూసుకోవాలి కదా అని పోలీస్ అంటుంటే... అయిందా నీ పని తిక్కా అస్సలు వదలకండి సార్ అని ఎంట్రీ ఇస్తాడు ప్రేమ్. ఆ తర్వాత ఆటోని ప్రేమ్ డ్రైవ్ చేస్తుంటే వెనుకే బండిపై జ్వాల, హిమ వస్తుంటారు. ఇంతలో ఆటో ఎక్కుదామని ఆపిన స్వప్న ... కొడుకు ప్రేమ్ ని చూసి షాక్ అవుతుంది..నువ్వేంట్రా ఆటో నడుపుతున్నావ్ అని అడుగుతుంది.