Nidhhi Agerwal promotes condoms: హీరోయిన్ నిధి అగర్వాల్ కండోమ్స్‌కు ప్రచారం కల్పిస్తున్నారు. మీరు చదివింది నిజమే... కండోమ్స్‌కు ఆమె పబ్లిసిటీ చేస్తున్నారు. ఒక కంపెనీకి చెందిన కండోమ్స్ ఉపయోగించమని ఆమె సలహా ఇచ్చారు. ఆ కండోమ్స్‌తో అనుభూతి బావుంటుందని చెప్పుకొచ్చారు. అంతే కాదు, ఆ కంపెనీకి చెందిన కండోమ్ యాడ్‌ను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పేజీల్లో పోస్ట్ చేశారు. నిధి అగర్వాల్ పోస్టులు చూసి చాలా మంది షాక్ అయ్యారు. మరికొంత ట్రోలింగ్ స్టార్ట్ చేశారు.
Nidhhi Agerwal criticized for posting advertisement promoting Condoms: నిధి అగర్వాల్ పోస్టుల కింద కొంత మంది అసభ్యకరమైన రీతిలో, ఇక్కడ రాయలేని భాషలో పోస్టులు చేశారు. కండోమ్స్ మీరు ఉపయోగించారా? అని కొందరు ప్రశ్నించారు. అనుభవంతో చెబుతున్నారా? అని కొందరు వెటకారంగా అడిగారు. ఇటువంటి యాడ్స్ చేయవద్దని కొందరు సలహా ఇచ్చారు. మొత్తం మీద సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ కండోమ్స్ ప్రచారం దుమ్ము దుమారం రేపుతోంది. ఆమె విమర్శలకు గురి కావడం ఇది తొలిసారి కాదు. గతంలో ఒక లిక్కర్ బ్రాండ్ ప్రమోట్ చేస్తూ... ఆమె పోస్ట్ చేశారు. అప్పుడు కూడా ఆమెను నెటిజన్స్ విమర్శించారు.
Also Read: ఏప్రిల్ రెండో వారంలో వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు
'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో నిధి అగర్వాల్ తెలుగులో పాపులర్ అయ్యారు. అంతకు ముందు అక్కినేని హీరోలు నాగ చైతన్యతో 'సవ్యసాచి', అఖిల్‌తో 'మిస్టర్ మజ్ను' సినిమాలు చేశారు. తర్వాత మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తొలి సినిమా 'హీరో'లో కథానాయికగా నటించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ 'హరి హర వీరమల్లు'లో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తాయని నిధి అగర్వాల్ ఆశిస్తున్నారు.