ఇన్నాళ్ళూ నదియా నటన చూశారు. ఇప్పుడు నదియా మాటలు వినడానికి తెలుగు ప్రేక్షకులు రెడీనా? తొలిసారి ఆమె తన గొంతు వినిపించడానికి సిద్ధమయ్యారు. అంటే తెలుగులో డబ్బింగ్ చెప్పారు. 'మిర్చి'లో ప్రభాస్‌కు తల్లిగా, 'అత్తారింటికి దారేది'లో పవన్ కల్యాణ్ అత్తగా నటించిన తర్వాత... తెలుగులో నదియా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు దర్శక - నిర్మాతలు ఆమె తలుపు తట్టడం ప్రారంభించారు.


తెలుగులో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా... ఇన్నాళ్ళూ తెలుగులో డబ్బింగ్ చెప్పుకోలేదు నదియా. తెరపై కనిపించేది నదియా అయితే, గొంతు వేరేవాళ్ళది. కానీ, ఇప్పుడు గొంతు కూడా ఆమెదే. నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా రూపొందుతోన్న 'అంటే సుందరానికి' సినిమాలో ఆమె ఓ రోల్ చేశారు. హీరోయిన్ నజ్రియా నజీమ్ తల్లిగా కనిపించనున్నారు. తన పాత్రను తానే స్వయంగా డబ్బింగ్ చెప్పారు నదియా.


"చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను. తెలుగులో తొలిసారి డబ్బింగ్ చెప్పాను. 'అంటే సుందరానికి' సినిమా కోసం! నాపై నమ్మకం ఉంచిన దర్శకుడు వివేక్ ఆత్రేయకు థాంక్స్" అని నదియా సోషల్ మీడియాలో పేర్కొన్నారు.


Also Read: 'హైపర్' ఆది ఎక్కడ? 'జబర్దస్త్'లో ఎందుకు కనిపించడం లేదు?






వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా జూన్ 10న విడుదల కానుంది. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ సంగీత దర్శకుడు. 


Also Read: కండోమ్స్‌కు నిధి అగర్వాల్ ప్రచారం - సోషల్ మీడియాలో దుమ్ము దుమారం